Pawan Kalyan may be protest one more time for people of telugu states

Pawan kalyan may be protest one more time for people of telugu states

Pawan Kalyan, Pawan kalyan Protest, Janasena, Telugu states, Farmers Suicide, Telugu language, Pawan, Pawan Kalyan News

Pawan Kalyan may be protest one more time for people of telugu states. He will protest for the protesction of telugu language and farmers suicides in telugu states.

ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పోరుబాట

Posted: 09/17/2015 04:37 PM IST
Pawan kalyan may be protest one more time for people of telugu states

జనసేనాని మరోసారి ప్రజాసమస్యలపై గళం విప్పేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్.. ఈనెలాఖరు నాటికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రైతు ఆత్మహత్యలతో పాటు తెలుగు భాష పరిరక్షణపై నడుం బిగించాలనే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని భూసేకరణ చట్టంపై గళం విప్పి సక్సెసైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..మరికొన్ని ప్రజాసమస్యలపై పోరుబాటకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్, వచ్చే నెలలో కొన్ని కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుండంతో.. ఈసమస్యపై పవన్ దృష్టిసారించాలని భావిస్తున్నారు. రైతుల్లో ఆత్మస్దైర్యాన్ని నింపి వారిని చైతన్యపరిచేందుకు కార్యక్రమాలను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం క్షేత్రస్ధాయిలో ఎలాంటి కార్యక్రమాలను చేపడితే బాగుంటుందనే అంశంపై మేధావులు, రైతుసంఘాల నేతలతో ఇప్పటికే సమాలోచనలు జరుపుతున్నారు.

ఆంధ్రా, తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల్లో రైతులతో మమేకమై చైతన్యసదస్సులు నిర్వహించాలనే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుండి ఈకార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాగే  రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో పర్యటించి, ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబాలను పరామర్శించాలని పవన్ యోచిస్తున్నారు. మరోవైపు తమిళనాడులో తమిళ నిర్భంద విద్య కారణంగా తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై పవర్ స్టార్ దృష్టిసారించారు. ఇప్పటికే తమిళ తెలుగు సంఘాలు చేస్తున్న ఆందోళనపై ఆరా తీసిన పవన్.. అవసరమైతే ఈ విషయంపై తమిళనాడు సీఎం జయలలితతో చర్చించాలని యోచిస్తున్నారు. ఈనెలాఖరునాటికి దీనిపై యాక్షన్ ప్లాన్ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఒకవైపు షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నప్పటికీ మరోవైపు ప్రజాసమస్యలపై తన ఆందోళనలను ఆపకుండా కొనసాగించేందుకు పవర్ స్టార్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles