danam nagender to join TRS on 23rd

Danam nagender to join trs

danam nagender, congress, talasani srinivas, TRS, minister talasani, TRS government advisor D.Srinivas, TDP, Asif nagar, telangana rastra samithi

if reports are to be true, former minister danam nagender to join telangana rastra samithi on 23rd of this month

కారు ప్రయాణానికి సిద్దమైన దానం..?

Posted: 09/20/2015 04:54 PM IST
Danam nagender to join trs

నేను వెళ్లను.. నన్ను వెళ్లగొట్టేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారు... పొమ్మనలేక పోగబెడుతున్నారు. అంటూ ఇన్నాళ్ల పాటు చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునేందుక రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నుంచి రాష్ట్రస్థాయిలో అనేక మంది సీనియర్ నేతలో తనకువున్న పరిచయాలను కూడా పక్కన బెట్టి.. అధికార పార్టీతో జత కట్టి కారు ప్రయాణం చేసేందుకు సుముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 23న దానం పార్టీలో చేరతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారు డీ శ్రీనివాస్ కు అనుంగు శిష్యుడని ముద్రపడిన దానం..  మంత్రి తలసాని మధ్యవర్తిత్వంతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా తెలియవచ్చింది. అయితే కాంగ్రెస్ ఈ వార్తలపై కాంగ్రెస్ వేచిచేసే ధోరణి అవలంభిస్తుంది. కాగా రాజకీయ విశ్లేషకులు మాత్రం దానం నిత్యం అధికారమున్న పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేయడం సహజమేనని అన్నారు. 2004లో టీడీపీ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు అప్పట్లో చేసిన ప్రయత్నాలను ఊటంకిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : danam nagender  congress  talasani srinivas  TRS  

Other Articles