jc prabhakar reddy agrees voice in audio tapes is chandrababu naidu's

Jc prabhakar reddy takes on kcr

JC Prabhakar reddy, TDP MLA, kcr, note for vote, AP chief minister chandrababu, phone conversation, Revanth reddy, mla stphenson, phone signals, tower location, jubliee hill, road number 24, Telangana TDP, cash for vote, note fo vote, Telangana government, ACB officials

jc prabhakar reddy agrees voice in audio tapes is chandrababu's by saying that their leader babu has not talked about any illegal transaction on phone

ఆ గొంతు బాబుదేనని అంగీకరిస్తున్నారా..?

Posted: 06/13/2015 04:47 PM IST
Jc prabhakar reddy takes on kcr

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలో పెట్టేలా తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పార్టీ సీనియర్ నేతలు ఆచితూచి మాట్లాడుతుండగా.. లేటుగా అయిన ఈ విషయమై స్పందించి.. తమ స్వామి భక్తిని చాటుకునే నేపథ్యంలో పలువురు తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును ఇరకాటంలో పడేసేలా వ్యాఖ్యాలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అనంతపురంలో స్పందించారు.

తమ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ తో మాట్లాడిన ఫోన్ సంబాషణలో ఎక్కడా.. డబ్బులు ఇస్తామని వ్యాఖ్యానించలేదన్నారు.  ధైర్యం, భరోసా ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని ఆయన గుర్తు చేశారు. రేవంత్రెడ్డిని పట్టుకున్నప్పుడే చంద్రబాబు ఆడియో టేపులు ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.  మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విలువలు గుర్తు రాలేదా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇంతవరకు బాగనే వున్నా అసలు ఆ సంభాషణలు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి కాదని ఇప్పటి వరకు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. జేపి ప్రభాకర్ రెడ్డి మాత్రం ఓ అడుగు ముందుకేసీ ఆడియో టేపులు తమ అధినేతవని చెప్పకనే చెప్పారు. అంతేకాదు అందులో తమ అధినేత ఎవరికీ డబ్బులిస్తామని, కానీ,  ఎంత ఇస్తామని కానీ చెప్పలేదని.. అసలు అలాంటి సంభాషణే జరగలేదని అంగీకరించారు. అయితే తమ ఎమ్మెల్యేలకు ధైర్యం, భరోసా ఇవ్వడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వైరి పక్షానికి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ధైర్యం, భరోసా కల్పించాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకు వచ్చిందన్న విషయం కూడా చెప్పలేదు. అది పక్కన బెడితే ఫోన్ లో మాట్లాడింది చంద్రబాబేనని అంగీకరిస్తారా..? అంటే అక్కడ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి స్పష్టత కొరవడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Prabhakar reddy  TDP MLA  kcr  note for vote  

Other Articles