Revanth mulling over to rope in his wife Geeta Reddy into action.

Revanth reddy s wife steps into action

Revanth Reddy's Wife Steps into Action, JC Prabhakar reddy, TDP MLA, kcr, note for vote, AP chief minister chandrababu, phone conversation, Revanth reddy, mla stphenson, phone signals, tower location, jubliee hill, road number 24, Telangana TDP, cash for vote, note fo vote, Telangana government, ACB officials, balakrishna, nara lokesh, chandrababu, jagan, congress, vote for note, Geeta Reddy, Revanth Reddy Case, Telangana TDP, cash for vote, jaipal reddy, former union minister

Telangana TDP senior leader and Kodangal MLA Revanth Reddy, who is facing the charge of bribing nominated MLA in the note-for-vote case, is quickly making his moves.

రేవంత్ రాజకీయ వారసురాలిగా గీతారెడ్డి..?

Posted: 06/13/2015 05:27 PM IST
Revanth reddy s wife steps into action

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఓటుకు నోటు కేసులో అభియోగాలను ఎదుర్కోంటూ ఏసీబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డి.. తన నూతన అస్త్రాన్ని కార్యరంగంలోకి దించేపనిలో వున్నట్లు సమాచారం. తన కూతురు నైమిషారెడ్డి నిశ్చితార్థం.. సత్యనారాయణ రెడ్డితో జరగడంతో.. ఇక తన కేసులో నిజానిజాలు వెలుగుచూసి, కోర్టు తీర్పును వెలువరించే వరకు వేచి వుండకుండా రేవంత్ రెడ్డి తన ప్రణాళికలకు వేగంగా కార్యరూపాన్ని ఇస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపైకి తన నూతన అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమవుతున్నారు

ఓటుకు నోటు కేసులో ఏపీబి అధికారులు కోర్టుకు అప్పగించిన అడియో, వీడియో ఫూటేజ్ లపై.. ఫోరెన్సిక్ ల్యాబ్ నిజానిజాలను నిగ్గుతేల్చనున్న క్రమంలో రేవంత్ రెడ్డి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. తన చేతిలోనే సదరు నియోజకవర్గం వుండేందుకు వీలుగా తన సతీమణి గీతారెడ్డిని రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు నారా లోకేష్, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు పార్టీ పెద్దలు కూడా రేవంత్ నిర్ణయం పట్ల సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

తన సతీమణి గీతారెడ్డి రాజకీయాలలో చురుకుగా వుండటంతో పాటు.. తన కుటుంబం నుంచి సదరు స్థానాన్ని కోల్పోకూడదన్న యోచనతో రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రేవంత్ ఈ నిర్ణయం తీసుకోడానికి కూడా మరో కారణం వుందట. అదేంటంటే.. రేవంత్ రెడ్డి సతీమణికి రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యని, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి సోదరుడి తనయగా అమెకు రాజకీయాలలో అందవేసిన చెయ్యని కూడా భావించిన రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రేవంత్ ఎప్పుడు రాజీనామా చేసినా.. ఇక టీడీపీ అభ్యర్థిగా రేవంత్ సతీమణి బరిలోకి దిగుతుందన్న ప్రచారం టీడీపీ కొడంగల్ శ్రేణులలో నూతన బలాన్ని ఇస్తుంది. మరి అమె విజయం సాధిస్తుంగా..? లేదా.? అన్న విసయం మాత్రం వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Geeta Reddy  Revanth Reddy Case  Telangana TDP  cash for vote  

Other Articles