News going viral on nara lokesh that he is also a part of vote for note controversy | revanth reddy | chandrababu naidu

Nara lokesh vote for note controversy chandrababu naidu acb officials revanth reddy stevenson

nara lokesh vote for note controversy chandrababu naidu acb officials revanth reddy stevenson

nara lokesh vote for note controversy chandrababu naidu acb officials revanth reddy stevenson : The News going viral on Nara lokesh that.. he is also a part of vote for note controversy. acb officials investigate on that way.

పెదబాబు ప్లానేస్తే.. చినబాబు చిటికేశాడా?

Posted: 06/12/2015 10:05 AM IST
Nara lokesh vote for note controversy chandrababu naidu acb officials revanth reddy stevenson

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టై చంచల్ గూడ జైల్లో వుండగా.. ఇతనితోపాటు మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. వీరేకాదు.. ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్టీవెన్ తో సంభాషణలు జరిపినట్లుగా ఓ ఆడియో టేప్ కూడా విడుదలైంది. దీంతో ఈ వ్యవహారంలో బాబు హస్తం కూడా వుందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం బాబుపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ ని బుట్టలో వేసుకునే భాగంగా ఈ వ్యవహారం మొత్తం బట్టబయలైంది.

ఇదిలావుండగా.. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ ఓటుకు నోటు వ్యవహారంలో కేవలం చంద్రబాబే కాకుండా ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌సన్‌తో జరిగిన బేరసారాలు, సంప్రదింపుల్లో లోకేశ్ కూడా జోక్యం చేసుకున్నారని సమాచారం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య వినియోగించిన ఫోన్ నుంచి ‘చినబాబు’ మాట్లాడినట్లు అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్ సంభాషణల రికార్డులను కూడా సేకరించింది. అయితే.. అందులోని మాటలు లోకేశ్‌వేనా? కాదా? అని నిర్ధారించుకునేందుకు ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అలాగే ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు కుమారుడి పాత్రపై దర్యాప్తు అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళనల్లో మునిగిందని చెప్పుకుంటున్నారు.
 
ఇప్పటికే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ రికార్డులు బట్టబయలైన సంగతి తెలిసిందే. తాజాగా చినబాబు ఫోన్ సంభాషణలు కూడా ధ్రువీకరణ అయితే ఆయన మెడకూ ఈ కేసు చుట్టుకోనుంది. కాగా, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తూ త్వరలోనే కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  nara lokesh  revanth reddy  vote for note controversy  

Other Articles