After Manchireddy Kishan reddy, prakash goud to join TRS later on | TRS | Manchi reddy kishan reddy | TDP | chandrababu

Prakash goud to join trs later on

prakash goud to join TRS later on, Manchireddy Kishan reddy to join TRS, Manchireddy Kishan reddy to join TRS on 24th april, TDP MLA Manchireddy gives shock to chandrababu, TDP, TRS, manchi reddy kishanreddy, TRS plenary, Chandrababu. telangana

TDP MLA Manchireddy Kishan reddy decided to join in the TRS party on 24th april. chandrababu naidu tour in mahaboobnagar on 23rd of april. TRS party president kcr invites manchi reddy kishan reddy and his followers in the trs party on 24th april.

మంచి రెడ్డి బాటలోనే ప్రకాష్ గౌడ్..? త్వరలో టీఆర్ఎస్ గూటికి..?

Posted: 04/22/2015 01:58 PM IST
Prakash goud to join trs later on

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పెకిళించాలన్న టీఆర్ఎస్ పార్టీ అభీష్టం.. కొద్దికొద్దిగా సంకల్పిస్తోంది. పార్టీని గడ్డ పరుస్థితి నుంచి మెరుగుపర్చేందుకు ఆ మధ్య యువ నాయకుడు.. నారా లోకేష్ బాబు చేసిన యత్నాలు ఫలించకపోగా.. అతను కేవలం ట్విట్టర్ ను అనుసంధానంగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పించడంతో అతడిని ట్విట్టర్ పిట్టగా అభివర్ణించారే తప్ప పార్టీకి ఎనగూరిన లాభం ఏమాత్రం లేదని తెలుసుకున్న పార్టీ వర్గాలు అతడిని తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వలసగా తీసుకెళ్లాయి. ఇక ఈ సమయాన్ని అదునుగా చేసుకున్న తెలంగాణ అధికారిక పార్టీ తెలంగాణ టిడిపి నేతలకు గాలం వేస్తోంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్శహించాలని అదేశించిన నేపథ్యంలో.. గ్రేటర్ లో బలంగా వున్న పచ్చ పార్టీని పక్కన బెట్టి అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అన్న తపన అధికార పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

ఈ క్రమంలో గత కొంతకాలంగా పక్కనబెట్టిన అపరేషన్ ఆకర్ష్ ను మళ్లీ తెరమీదకు తీసుకోచ్చింది. ముందుగా మంచిరెడ్డిని పార్టీ వైపు ఆకర్షించింది. సరిగ్గా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించున్న క్రమంలో ఆయనకు షాక్ ఇచ్చారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారు. టీడీపీ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ ఉదయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అయితే మంచి రెడ్డి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఈ నెల 24వ తేది టిఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ఖరారరైంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఇవ్వాలని పార్టీ అంతర్గతంగా ఓ నిర్ణయానికి వచ్చింది.

అయితే గతంలో మంచిరెడ్డితో పాటు ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరి నిమిషంలో పార్టీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించడంతో కేవలం తీగల కృష్ణారెడ్డితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే పార్టీలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు తాజాగా జిల్లా అధ్యక్షుడిగా కోనసాగుతున్న మంచిరెడ్డి.. టీఆర్ఎస్ లో చేరుతున్న క్రమంలో.. ప్రకాష్ గౌడ్ కు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలను అప్పగిస్తే ఆయన కూడా టీఆర్ఎస్ తీర్థం తీసుకుంటారేమోనన్న అందోళన పార్టీ వర్గాల్లో నెలకోంది. ఇందుకు మంచిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా బలాన్నిస్తున్నాయి. నాది ఆరంభమే.. నా తరువాతే భవిష్యత్తులో ఎంత మంది టీఆర్ఎస్ లోకి వచ్చి చేరుతారో వేచి చూడండి అన్న ఆయన వ్యాఖ్యలు మరికోందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారన్న సంకేతాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ ను కాదని జిల్లా పరిధిలోకి వచ్చే పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అద్యక్ష పదవిని కట్టబెడితే.. తెలుగు దేశం ఆంద్రవాళ్ల పార్టీ అని.. అందుకే వారికే పార్టీ పగ్గాలను అప్పగించిందన్న ప్రచారం కూడా జోరుగా సాగి పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి వుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎటోచ్చినా.. ముందు నుయ్యి.. వెనక గోయ్యి అన్నట్టుగా మారింది తెలంగాణలో టీడీపీ పరిస్థితి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash goud  Manchireddy kishan reddy  TRS  TDP  chandrababu  

Other Articles