Galla Jaydev and CM Ramesh Fight for AP Olympic Association President post

Galla jayadev vs cm ramesh fights for olympic association

Galla Jayadev vs CM Ramesh fights for Olympic Association, AP Olympic Association President post, Two Telugu Desam Party MPs, Galla Jayadev, CM Ramesh, Galla Jayadev vs CM Ramesh

Two Telugu Desam Party MPs Galla Jayadev and CM Ramesh claims of the president of the AP Olympic Association.

టీడీపీ ఎంపీల మద్య ఒలంపిక్ రగడ

Posted: 04/19/2015 07:13 PM IST
Galla jayadev vs cm ramesh fights for olympic association


ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు రాను రాను వివాదాస్పదంగా మారాయి. అధ్యక్షుడుగా గల్లా జయదేవ్‌ ఎన్నికయినట్లు ఇప్పటికే ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కూడా గుర్తింపు ఇచ్చినట్లు ఆయన ప్రకటించుకున్నారు. ఆదివారం గుంటూరులో కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు. పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. నేను ఎవరిపైనా విమర్శలు చేయనని జయదేవ్‌ తెలిపారు. తమకు ఒలింపిక్‌ అసోసియేషన్‌ గుర్తింపు ఉందని చెప్పారు.

అయితే దీన్ని మరో వర్గం ఖండిస్తోంది. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగినట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని బంజారా ఫంక్షన్‌ హాలులో ఓటింగ్‌ నిర్వహించారు. ఈ వర్గానికి సీఎం రమేష్‌ నేతృత్వం వహిస్తున్నారు. వీరికి సమైక్య రాష్ట్రంలో అధ్యక్షునిగా వ్యవహరించిన లగడపాటి రాజగోపాల్‌ మద్దతు ఇస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఏపీ, తెలంగాణ ఒలింపిక్‌ సంఘాలకు వేరు వేరుగా ఎన్నికలు నిర్వహించామని జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఏపీ ఒలంపిక్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా సీఎం రమేష్‌ ఏకగ్రీంగా ఎన్నిక అయ్యారని ఆయన చెప్పారు.

క్రమశిక్షణకు తమ పార్టీ మారు పేరని, పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా మెలుగుతారని టీడీపీ అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో గర్వంగా చెబుతుంటారు. అయితే ఆయన వ్యాఖ్యాలను నీటి మూటలుగా మారుస్తూ పార్టీ కి చెందిన ఎంపీలే.. పదవుల సందేరంలో పోటీ పడి.. క్రమశిక్షనను అధిగమిస్తున్నా చంద్రబాబు ఎలా మిన్నకుంటున్నారు. అయినా.. ఎంపీలు ఒలంపిక్ పదవి కోసం పోటీ పడుతూ.. ఏం సంపాదించాలను కుంటున్నారో తెలియదు కానీ.. ప్రజలు మాత్రం ఏం లాభం లేకపోతే ఎంపీలు ఎందుకు పోటీ పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Galla Jayadev  CM Ramesh  Olympic Association  

Other Articles