Five alleged SIMI activists shot dead after escape bid in warangal

Simi terrorists encountered at nalgonda planned to escape vikarudddin

SIMI terrorists encountered at nalgonda planned to escape vikarudddin, isi vikaruddin, simi terrorist vikaruddin, encounter in janagam warangal, warangal jail police killed vikaruddin, warangal jail police killed suleman, warangal jail police killed five isi agents in encounter, police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorist shot dead, isi agents shot dead in Telangana, isis

SIMI terrorists shot dead at nalgonda made efforts to escape vikarudddin along with Five alleged SIMI activists, Questions araise as both encounters took place in a week

వికారుద్దీన్ ను తప్పించడానికే.. సిమీ ఉగ్రవాదులు యత్నామా..?

Posted: 04/07/2015 03:38 PM IST
Simi terrorists encountered at nalgonda planned to escape vikarudddin

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవిస్తే.. మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని గత పాలకులు, అధికారులు గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షర అసత్యాలుగా మారినా.. కాల్పుల మోతలు మాత్రం వినబడుతున్నాయి. అయితే అవి అన్నల తుపాకీ చప్పుళ్లు కాదు.. దేశాన్ని విచ్చినం చేసి, హింసను ప్రేరేపించేందుకు ద్రోహులు, సిమీ ఉగ్రవాదులు చేస్తున్న దాడులు. ప్రశాంతమైన పల్లెసీమలు భీతిచెందిన భయం గుప్పిట్లోకి జారుకునెలా వారం రోజుల వ్యవధిలో రెండు ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే.. అనేక అనుమానాలకు తావిస్తోంది. నల్గోండ జిల్లాలో మరణించిన సిమీ ఉగ్రవాదులు వరంగల్ జైలు నుంచి ఇవాళ వచ్చిన వికారుద్దీన్ సహా ఐదుగురిని విడిపించేందుకు పథకాన్ని రచించారా..? అన్న సందేహాలు తెరమీదకు వస్తున్నాయి

సూర్యాపేట బస్టాండ్లో పోలీసులపై తీవ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు  పోలీసుల మరణం దగ్గరి నుండి ఇవాళ జరిగిన వరంగల్ జిల్లా జనగామ పెంబర్తి ఎన్ కౌంటర్ ఘటన వరకు అన్ని అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. సూర్యాపేట బస్టాండ్ లోని కాల్పుల ఘటన.. ఆ తరువా రెండు రోజుల వ్యవధిలో నల్గొండ జిల్లాలోని అర్వపల్లిలో మరో ఎన్కౌంటర్. ఒక కానిస్టేబుల్, ఇద్దరు తీవ్రవవాదుల హతం.  మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలోని జనగామ వద్ద ఎస్కార్ట్ పోలీసుల  కస్టడీ నుంచి  తప్పించుకునేందుకు యత్నించి మట్టికరిచిన సిమీ ఉగ్రవాదుల వరకు మొత్తం అంతా వ్యూహం ప్రకారమే జరిగిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సూర్యపేట బస్టాండ్లో  కాల్పులు  జరిపిన తర్వాత తీవ్రవాదులు నల్గొండ జిల్లాలోనే ఎందుకు ఉండిపోయారు. మళ్లీ పోలీసులను ఎందుకు ఢీకొన్నారు. వికారుద్దీన్ను తప్పించే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగిందా... తమ పథకంలో భాగంగానే నల్గొండ జిల్లాలోనే ఉండిపోయారా? వికారుద్దీన్ తప్పించుకునే ప్రయత్నం ముందుగా పన్నిన వ్యూహంలో భాగమేనా? అంటే అవుననే సమాధానాలే అధికంగా వినబడుతున్నాయి. సూర్యపేట ఘటన తర్వాత నల్గొండ జిల్లాలోనే  దాదాపు 36 గంటలు తీవ్రవాదలు గడపడం కొంత ఆశ్యర్యాన్ని కలగజేసింది. రాష్ట్రాన్ని దాటడం కష్టమైనప్పటికీ అసాధ్యం కాదు. అయినా ఇద్దరు తీవ్రవాదుల కదలికలు జిల్లాలోనే కనిపించడం పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఏదైనా దాడికి కుట్ర పన్నారా అనే  అనుమానాలు రెకెత్తిస్తున్నాయి.

ఇవాళ ఉదయం వరంగల్  జైలు నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ గ్యాంగ్ ఎస్కార్ట్ వాహనం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఐఎస్ఐ ఏజెంట్లను పోలీసులు మట్టుబెట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపైకి దాడి చేయడం...తమ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని పోలీసు అధికారులు చెప్పారు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా నల్గోండ, వరంగల్ జిల్లాలో తలదాచుకొని ఉండే అవకాశముందని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : escape efforts  vikaruddin  simi terrorists  warangal jail  

Other Articles