BJP to expell three mps from committee, who broke controversary remarks on tobacco

Bjp to expell three mps from parlimentary committee

Ramprasad sharma, controversy coments on tobacco, ban on tobacco, Pictorial Warning, Tobacco Products, Mp Shyama Charan Gupta, Beedis Less Harmful Than Sugar, Shyama charan gupta questions cancer link, Ramprasad sharma

BJP to expell three mps from anti tobacco parlimentary committee, who broke controversary remarks on tobacco and embarassed government

ఆ కమిటీ నుంచి ఆ ముగ్గురికి ఉద్వాసన..?

Posted: 04/06/2015 04:51 PM IST
Bjp to expell three mps from parlimentary committee

పోగాకు ఉత్పత్తుల ద్వారా క్యాన్సెర్ రాదని.. కేంద్రంలోని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని వినిపించిన ముగ్గరు పార్లమెంటరీ సభ్యులకు ఆ పార్లమెంటరీ కమిటీ నుంచి ఉద్వాసన పలకనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పోగాకు ఉత్పత్తులను తగ్గించేందుకు విధివిధానాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా కోనసాగుతూ.. పోగాకు ఉత్పత్తులపై హెచ్చరిక ముద్రణలను పెద్దది పెంచే అంశానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వారికి కమిటీ నుంచి తోలగించనున్నారని సమాచారం.

అంతేకాదు పోగాకు వల్ల కాన్సర్ రాదని దిలిప్ గాంధీ, ఆ తరువాత శ్యామ్ చరణ్ గుప్తా వీరి తరువాత రామ్ ప్రసాద్ శర్మ మద్దత్తు పలకడం.. ఇందుకు అనేక ఉదాహరణలను కూడా జారీ చేయడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. పోగాకు కన్నా చెక్కర అత్యంత ప్రమాదకరమని, వాటిని కూడా నిషేధిస్తారా అంటూ ప్రభుత్వంపైనే ప్రశ్నల వర్షం కురింపించారు. చిన్న పిల్లలకు అన్న ప్రాసన తరువాత పెరుగన్నం లేదా పాలు చెక్కర కలిపిన అన్నం తినిపిస్తారు. కానీ అన్నంలో పోగాకు వేసుకుని ఎవరూ తినరన్న విషయాన్ని కూడా మరచి పోగాకు ఉత్పత్తులను సమర్థించారు. వాటిపై హెచ్చరిక బోమ్మలను ఇప్పుడున్న పరిమాణంలోనే కోనసాగించాలని వాటిని పోడగించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యాలపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేగింది.

అయితే పార్లమెంటరీ కమిటీ సభ్యుల వ్యాఖ్యలను నుండి బీజేపి తనకు తానే కాస్త దూరం జరిగింది. పార్లమెంటరీ కమిటీ ప్యానెల్ సమావేశం తరువాత వీరిని కమిటీ నుంచి తోలగించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోగాకు ఉత్పత్తుల తగ్గింపుకు విధానాలను ఖరారు చేయాల్సిన కమిటీలో పోగాకు ఉత్పత్తుల యజమానులు, వారిని సమర్థించే వారిని ఎలా నియమించారన్న ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడంతో వారిపై వేటు తప్పదని తెలుస్తోంది.

అయితే కమిటీ సభ్యులను సమర్ధించే వారూను లేకపోలేదు. బహిరంగ ప్రదేశాలలో దూమపానం చేయకూడదని చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్న నేపథ్యంలో చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేస్తే.. పోగాకు ఉత్పత్తులను వాడకం క్రమేనా తగ్గిపోతుందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. ప్రభుత్వ విధానాలను రూపోందించాల్సిన కమిటీలో సిగరెట్, బీడీ సంస్థల యజమానులకు చోటు కల్పించిన ప్రభుత్వంపైనా విమర్శలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా పోగాకు ఉత్పత్తుల తగ్గింపు పార్లమెంటరీ కమిటీలో కొనసాగుతున్న వారే.. అందకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, వారిపై చర్యలకు కూడా ఉపక్రమించనుందని సమాచారం.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramprasad sharma  assam  tobacco  bjp mp  cancer  

Other Articles