Why telangana jac silent on kcr anti poor policies

telangana jac, t jac, kodandaram, telangana movement, telangana bill, telangana protests, telangana state, telangana government, states in india, latest news, kcr, trs, telangana rastra samithi, k chandrashekar rao, telangana cabinet, telangana government policies, silence, anti poor policies

a tdp leader asking why now a days telangana jac leaders silent on kcr ruling and also on government's anti poor policies : rumors that t jac fraid of telangana government and not have strength to fight against government

టీ.జేఏసీ ఎందుకు మౌనంగా ఉంది..?

Posted: 09/20/2014 08:13 AM IST
Why telangana jac silent on kcr anti poor policies

మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టింది టీఆర్ఎస్ అయితే.., ముందుండి నడిపించిది టి.జేఏసీ. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి జేఏసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. జేఏసీ చైర్మన్ గా కోదండరాం ఏదైనా ఉద్యమ ప్రకటన చేస్తే దానికి అనూహ్య స్పందన వచ్చేది. మిలియన్ మార్చ్ అయినా.., సకల జనుల సమ్మె అయినా లేక మరొక పోరాటమైనా. ఏ ఉద్యమం అయినా అంతా కలిసి చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారు. అయితే సమైక్య ప్రభుత్వ విధానాలను గల్లపట్టి ప్రశ్నించిన తెలంగాణ జేఏసీ ఇప్పుడున్న తెలంగాణ సర్కారును కనీసం ప్రశ్నించలేకపోతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

పార్టీల బలం లేకనా..?

తెలంగాణ జేఏసీ అంటే అందులో ప్రధానమైనవి రాజకీయ పార్టీలు అని చెప్పవచ్చు. జేఏసీ ప్రారంభించినప్పుడు దాదాపు అన్ని పార్టీలు అందులో భాగస్వాములు అయినా.., తర్వాత ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోయారు. చివరకు టీఆర్ఎస్ మిగిలింది.., బీజేపి అంటి ముట్టనట్లు వ్యవహరించింది. అయినా సరే జేఏసీ ఉద్యమానికి పిలుపునిచ్చందంటే అనూహ్య స్పందన వచ్చేది. ఇది చూసిన పార్టీలు జేఏసీలో కలవకపోయినా ఆ నేతలు చేసే కార్యక్రమాల్లో పాల్గొని, సహాయం అందించేవారు. అంతేకాకుండా తెలంగాణ జేఏసీ అంటే ప్రజల్లో ఉన్న ఉద్దేశం.. రాష్ర్టం సాధించేందుకు ఏర్పడిన ఉద్యమ సంస్థ. ప్రస్తుతం తమ కల సాకారం అయింది కాబట్టి ఇక జేఏసి అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు. అటు పార్టీలు కూడా ప్రస్తుతం జేఏసీని పట్టుకుని ఉండే పనిలో లేవు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టేందుకే వారికి సమయం సరిపోవటం లేదు. అందువల్ల జేఏసి గతంలో మాదిరిగా బలంగా లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఏమి అనలేకపోతుందని విశ్లేషకులు అంటున్నారు.

అటు జేఏసీలోని నేతలు కూడా ఉద్యమం సమయంలో క్రియాశీలకంగా పోరాడారు. ఇఫ్పుడు రాష్ర్టం ఏర్పడింది కాబట్టి, ఎవరి పనుల్లో వారున్నారు. ఇఫ్పుడు కూడా వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. పోరాడాలి అంటే ఆసక్తి చూపేవారు ఎక్కువగా లేరు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా.., తెలంగాణ రాష్ర్టం ఏర్పడి, ప్రభుత్వం ప్రారంభం కావటంతోనే కేసీఆర్ జేఏసీని పక్కనబెట్టారని అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారోత్సవానికి కోదండరాంను పిలవలేదని పలువురు తెలంగాణ నేతలు అంటున్నారు. అంటే ఆయన ఇక జేఏసీ అవసరం లేదనుకున్నారు. అంతేకాకుండా సంపూర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో.. ఎవరిని ఏమైనా అనాలంటే కూడా ఆ తర్వాత వెనక ఉన్న నేతలను ప్రలోభపెట్టి ప్రభుత్వం వైపు తిప్పుకుంటే తిప్పలు తప్పవని సంస్థ భావిస్తోంది. అందువల్లే ఉద్యమ సంస్థ సారధి అయిన కోదండరాం కూడా అప్పుడప్పుడూ ఇలా చేస్తే బాగుండేది అంటున్నారు తప్ప సూటిగా ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారు. మరొక విషయం ఏమిటంటే జేఏసీలో ముఖ్య నేతలుగా ఉన్న కొందరికి టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసింది. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే తమకు ఏదైనా లాభం కాని.., తిడితే ఏం ఉంటుంది అని కొందరు నేతలు అనుకుంటున్నారు.

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదేనేమో. ఆరు నెలలకు ముందు తెలంగాణలో ఎక్కడకు వెళ్ళినా.., ఏ పోరాటానికి పిలుపునిచ్చినా వచ్చిన అనూహ్య ప్రజా స్పందన ఇఫ్పుడు లేదు. ఒకప్పుడు కోదండరాం వస్తున్నాడంటే అంతా తరలివచ్చేవారు. ఏం చెప్తారో విందాం అనుకునే వారు. కాని ఇప్పుడు అదే కోదండరాం సార్ వస్తున్నారు. అంటే వెళ్లేవారు వెళ్తున్నారు. మిగతా వారు ఏం వెళ్తాంలే.., చూద్దాం అనుకుంటున్నారు. అవసరం తీరిపోతే ఎవరైనా అంతే అనుకోవాలా.., లేక ఏది శాశ్వతం కాదు అనుకోవాలా.., ఇప్పుడు జఏసీనే నిర్ణయించుకోవాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  t jac  telangana  latet news  

Other Articles

 • Priyanka gandhi detained for last 28 hours without an order or fir

  ప్రియాంకా గాంధీది అరెస్టా.? అనధికారిక నిర్భంధమా.?

  Oct 05 | కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణమారణకాండను నిరసిస్తూ.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసిన... Read more

 • Swachh bharat 8th anniversary dirt and dust in rooms at pac guest house

  ధుమ్ముధూళితో నిండిన గది.. ఇదేనా స్వచ్ఛా యూపీ యోగీ.?

  Oct 04 | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలో నూతన అధ్యాయం లిఖించేందుకు శ్రీకారం చుట్టిన స్వచ్ఛా భారత్ మిషన్ ను సరిగ్గా అక్టోబర్ 2, జాతిపిత మహాత్మ గాందీ జయంతిని పురస్కరించుకుని తీసుకువచ్చిన విషయం... Read more

 • Vaccination promotion ktr vijaysai post same photos on same platform

  వీళ్లు ఏ రాష్ట్రవాసులో కేటీఆర్, సాయిరెడ్డి సార్లకే తెలుసు.?

  Sep 24 | తెలంగాణ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని ప్రతీ పనిలో తనదైన ముద్ర వేసుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడిగా కన్నా తండ్రిని మించిన తనయుడిగా తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతున్న... Read more

 • New entrant padi kaushik reddy overtakes seniors in race for mlc post

  సినియర్లకు భంగపాటు.. మింగుడుపడని అధిష్టాన నిర్ణయం.?

  Aug 03 | హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో పడిన నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్... Read more

 • Huzurabad bypolls who amongst these four candidates will get trs ticket

  హుజురాబాద్ ఉపఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో.?

  Aug 02 | హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీకి చెందిన నేతను బరిలోకి దింపుతుందా.? లేక వలస వచ్చిన నేతలనే బరిలోకి దింపుతుందా.? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్... Read more

Today on Telugu Wishesh