Ys jagan mohan reddy latest sensational comments on tdp party and seemandhra people

ys jagan mohan reddy, tdp party, ysr congress party, tdp party leaders, chandrababu naidu news, ysr congress party leaders, jagan mohan reddy andhra pradesh, jagan mohan reddy family members, jagan mohan reddy ysrcp, jagan mohan reddy chandrababu naidu

ys jagan mohan reddy latest sensational comments on tdp party and seemandhra people

జగన్ వెంటపడుతున్న సీమాంధ్రప్రజలు! ట్రెండ్ మారింది?

Posted: 09/19/2014 08:59 PM IST
Ys jagan mohan reddy latest sensational comments on tdp party and seemandhra people

(Image source from: ys jagan mohan reddy latest sensational comments on tdp party and seemandhra people)

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీ బాగానే ఓట్లు గెలుచుకుంది కానీ.. అధికారాన్ని మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. జగన్ కు ఇంకా రాజకీయ అనుభవం లేదనో.. లేక ఇంకో కారణంతోనో ప్రజలు ఆయన్ను అప్పడు గెలిపించలేదు కానీ.. ఇప్పుడు మాత్రం వరుసబెట్టి క్యూలో ఈయనకోసం వెయిట్ చేస్తున్నారని సమాచారాలు వెలువడుతున్నాయి. ఎంతో నమ్మకంతో ఏపీ అధికారాన్ని టీడీపీ పార్టీకి అప్పగించిన ప్రజలు.. ఇప్పుడా పార్టీని, నాయకుల్ని ప్రజలు విశ్వసించడం లేదని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఇన్నిరోజులైనా.. సంక్షేమ పథకాలు గానీ, రాజధాని వ్యవహారంలోగానీ, రుణమాఫీ విషయంలోగానీ ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజలు ఇలా జగన్ వైపు మల్లినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నది మరెవరో కాదు.. సాక్షాత్తూ వైకాపా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటువంటి మాటలు ఆయన చెప్పడం కొత్తేమీ కాకపోయినా.. ఈసారి చేసిన కామెంట్లు కొంచెం సంచలనమే సృష్టించాయనే అనుకోవాలి. తాజాగా అనంతపురం జిల్లాలో పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న జగన్ మాట్లాడుతూ.. ఇలా మరోసారి టీడీపీ పార్టీ మీద ధ్వజమెత్తారు. టీడీపీ పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలను బయటపెడతామని.. ఎప్పటికప్పుడు ఆ విషయాలపై స్పందించాలని తన పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు. టీడీపీ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని ఘాటుగా విమర్శలు చేశారు. బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భరోసాను ఇవ్వాలని సూచించారు. సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ మోసాన్ని ప్రజలు గుర్తించారని.. ఇప్పుడు ప్రజలంతా తమ పార్టీవైపే చూస్తున్నారంటూ నేతలు భరోసానిచ్చారు.

మరోవైపు.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా నాలుగు నెలలైనా పూర్తి కాలేదు... అప్పుడే హామీలను ఎలా నెరవేర్చగలుగుతారని పేర్కొంటున్నారు. పైగా ఆంధ్రరాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని.. ఈ నేపథ్యంలో సహాయం చేయడానికి కేంద్రం కూడా వెనకడుగు వేస్తోందని చెబుతున్నారు. అయినప్పటికీ బాబు రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచేందుకు చాలా కష్టపడుతున్నారని.. భవిష్యత్తులో ఆయన పనితనం ఏంటో అందరూ గుర్తిస్తారని వెల్లడిస్తున్నారు. అయితే ప్రజలు తమ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారని జగన్ చెప్పుకోవడం చాలా తమాషాగా వుందని నవ్వేస్తున్నారు. జగన్ ఇటువంటి కామెంట్లు చేయడం ఆపేసి... అభివృద్ధి విషయంలో టీడీపీ ప్రభుత్వానికి తనవంతు కృషి చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles