Errabelli meets cm kcr secretly

TDP, senior leader, errabelli dayakar rao, cm kcr, secretly, TRS, Telangana TDP

tdp senior leader errabelli dayakar rao meets cm kcr secretly, he may join Trs soon

కారు ప్రయాణానికి సిద్దమైన మరో టీడీపీ సీనియర్..

Posted: 09/22/2014 01:10 PM IST
Errabelli meets cm kcr secretly

ఆయన తెలుగు దేశం పార్టీలో సీనియర్ నాయకుడు.. ఉమ్మడి రాష్ట్రంలోనే 24 క్యారెట్ల టీడీపీ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన నేత. ఆయనే ఎందుకిలా చేశాడు. ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన నేత.. ఒక్కసారిగా పక్క చూపులు ఎందుకు చూస్తున్నాడు. ఇప్పుడిదే ప్రశ్న టీడీపీలోని ఇరు ప్రాంతాల నేతలలో నెలకొంది. ఇంతకీ ఎవరాయన..? ఆయనేం చేశాడనేగా మీ ప్రశ్న.

ఆయనే ఎర్రబెల్లి దయాకర్ రావు. సైకిల్ ప్రయాణం చేసి చేసి అలసిపోయినట్టు వున్నాడు పాపం.. అందుకనే కారు ప్రయాణం చేసేందుకు సిద్దమయ్యాడు. నిన్న అర్థరాత్రి దాటాక.. గన్ మెన్ కూడా లేకుండా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రహస్యంగా కలుసుకున్నారు. ఇప్పుడిదే వార్త అటు టీడీపీలోనూ.. ఇటు టీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

మెట్రో రైలు భూములు, డిజైన్ వివాదంలో టీడీపీ నేతలు కేసీఆర్ టార్గెట్ గా విమర్శలను గుప్పిస్తుండగా, ఎర్రబెల్లి అండ్ కో టీఆర్ఎస్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్దికాలంగా తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని భావించిన ఎర్రబెల్లి.. చంద్రబాబు వద్ద అక్కస్సు వెళ్లగక్కలేక..సైలెంట్ గా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పగ్గాలు తనకే అందుతాయని భావించిన నేతను.. పార్టీలోనే ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నారని, అందుకనే అయన కారు ప్రయాణానికి సిద్దమయ్యారని సమాచారం.

తెలంగాణలో టీడీపీని కనుమరుగు చేస్తామన్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చుతూ.. ఎర్రబెల్లి లాంటి సీనియర్ నేతలు కారును ఎక్కెందుకు వెళ్తే.. జూనియర్ నేతలతో పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందన్న ప్రశ్న తెలంగాణ టీడీపీ కార్యకర్తలను కలవరానికి గురిచే్స్తుంది. తెలంగాణలోని కేసీఆర్ సఃర్కార్ అపరేషన్ ఆకర్ష్ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తే.. మరో ఐదేళ్ల తరువాత పార్టలో కొనసాగే నేతలు ఎవరని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  senior leader  errabelli dayakar rao  cm kcr  secretly  TRS  Telangana TDP  

Other Articles