Telangana government vs engineering colleges on emacet issue

emacet issue, emacent issue in telangana state, telangana Government, Fast Committee, emacet students, Engineering Colleges,

telangana Government vs Engineering Colleges on emacet issue

కొత్త లొల్లితో ముదురుతున్న వివాదం!

Posted: 08/12/2014 06:59 PM IST
Telangana government vs engineering colleges on emacet issue

గారెలు తినగతినగా.. చేదు అనిపిస్తాయి.. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన పై రెండునేలలకు తెలంగాణ ప్రజలకు విసుగు పుట్టింది. సిఎం కేసిఆర్ పాలనలో.. ఇళ్లు పొగొట్టుకున్న వారు, స్థలాలలు పొగొట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, సుసైడ్ చేసుకున్న ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇప్పుడు కేసిఆర్ తీరుతో అటు ఇటు నలిగిపోతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేశంగా ఉన్నారు.

అసలే ఈరోజుల్లో పిల్లల చదువులు అంటే.. తల్లిదండ్రులకు .. చాలా భారమైన పని, కష్టపడి పిల్లలను చదవించుకుంటే.. చివరకు విద్యను కూడా రాజకీయం చేసి, కొత్త సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరుకు వారే మేము గొప్ప గొప్ప అంటూ.. గొప్పలకు పోయి .. విద్యార్థల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

తెలంగాణ సర్కార్ పై ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు కొత్త లొల్లి ని తెరపైకి తెచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏ పథకమైనా పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు .. కానీ ఏరోజు ఆడ్మిషన్ తీసుకుంటే అదే రోజు ఫీజులు చెల్లించాలని కాలేజీ ల యాజమాన్యల ప్రతినిధులు కోరుతున్నారు.

దీంతో తెలంగాణ సర్కార్ కు ఎక్కడో కాలింది. దీంతో వెంటనే తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం అంధించే ఫాస్ట్ కమిటీ తీవ్రంగా ఫైర్ అయ్యింది. మీరు కాలేజీలు నడుపుతున్నారా? లేక విద్యను వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు కూడా అంతే స్థాయిలో మేం వ్యాపారం చేయటం కాదు, మా డబ్బులతోనే జెఎన్ టీయ్, ఎంసెట్ ఆఫీసులు నడుస్తున్నాయి. అది తెలుసుకోండని తెలంగాణ సర్కార్ షాకిచ్చింది.

అంతేకాకుండా ఆగస్టు 31 లోపు పాత బకాయిలన్నీ చెల్లించాలి. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో పాత విధానాలే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. తెరపైకి వచ్చిన కొత్త లొల్లితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా పిల్లల భవిష్యత్తుతో.. తెలంగాణ సర్కార్, కాలేజీ యాజమాన్యాలు ఆటలాడుకుంటున్నాయని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ కొత్త లొల్లి ఎటువైపు దారి తీస్తుందో చూద్దాం!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles