Your cup of tea has toxic pesticide greenpeace india

Greenpeace, Indian tea brands, cup of tea, toxic pesticide, your morning tea, Cup Chai,

Your cup of tea has toxic pesticide Greenpeace - India: The Indian arm of Greenpeace, a global pressure group for the environment, alleged on that pesticides considered both highly and..

టీ తాగుతున్నారా? జీవితం సంకనాకినట్లే ?

Posted: 08/12/2014 05:59 PM IST
Your cup of tea has toxic pesticide greenpeace india

మీరు ప్రతి రోజు టీ తాగుతున్నారా...? అయితే మీ జీవితం సంకనాకినట్లే? అని కొన్ని సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. టీ తాగితే మంచి హుషారు వస్తుందని కొంతమంది కాకమ్మ కథలు చెబుతుంటారు. కానీ టీ ఆగితే వచ్చేది హుషార్ కాదట.. జీవితమే హుష్ కాకి అవతుందని చెబుతున్నారు.

అలా ఎందుకంటారా?

ఇటీవల కాలంలో అన్నీ కల్తీ వస్తువులే దొరుకుతున్నాయి. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అలాగే టీ పొడి కూడా కల్తీ, కానీ అందులో మనిషి చంపే విషయపదార్థలు కలుపుతున్నట్లు ఒక సంస్థ అనేక సంవత్సరాలు పరిశోదనలను చేసి, ఈ విషయాన్ని బయట పెట్టింది. అయితే టీ పై ఎవరి నమ్మకం వారిది. కానీ గ్రీన్ పీస్ అనే స్వచ్ఛంధ సంస్థ టీ పై పరిశోధన చేసి కొత్త విషయాన్ని బయట పెట్టింది.

మనం క్వాలిటీ కంటే.. బ్రాండ్లపైన నమ్మకం ఎక్కువు? అందుకే ఫలనా బ్రాండ్ర్ టీ బాగుంటుందని చాలా చెబుతుంటారు. అసలు ఈ ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీ పోడిలో ఏం ఉంటుందో తెలుసా? అతి ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలున్నాయట. మొత్తం 49 నమూనాలు పరిశీలించారు. వాటిలో 29 నమూనాల్లో ఒక్కొక్కటి 10 రకాల పురుగుమందు అవశేషాలను కలిగి ఉన్నాయట.

tea-toxic-pesticide-greenpeace-india

ఈ విషయాలను 'గ్రీన్ పీస్' సీనియర్ ప్రచారకర్త నేహా సెహ్ గల్ తెలిపారు. తమ అధ్యయనంలో భాగంగా ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, ముంబయి వంటి మహానగరాల్లో రిటైలర్ల నుంచి తేయాకును సేకరించామని నేహా చెప్పారు. కాగా, 67 శాతం నమూనాల్లో ప్రమాదకార ఆనవాళ్ళు లభించాయని తెలిపారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తేయాకు రంగాన్ని పురుగుమందుల వాడకానికి దూరంగా తీసుకెళ్ళాలని నేహా ప్రముఖ కంపెనీలను అర్థించారు.

ఈ విషయం టీ తాగే ప్రియులకు కొంచెం చేదు వార్తే? అయినా ఇది నిజం అని గ్రీన్ పీస్ సంస్థ చెబుతుంది. నేను పుట్టిన దగ్గరనుండి .. ఈ బ్రాండ్ టీ నే తాగుతున్న .. ఇప్పటి వరకు నాలో ఎలాంటి అనారోగ్యం కనిపించలేదని చెప్పే మహానుభావులు ఉన్నారు. అయినా ఎవరి నమ్మకం వారిది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Business news  Greenpeace  Indias Tea Board  morning tea  Indian tea brands  

Other Articles