ప్రకృతి మృత్యువుపగ పట్టిందో, మనిషి తప్పిదమో తెలియదు గానీ.. తెలుగు నేలన పుట్టిన బంగారు బిడ్డలు భవిష్యత్తును.. హిమాచల్ లోని బియాస్ నది మింగేసింది. కన్నబిడ్డలు కళ్ల ముందే అర్థాయుష్యులై పోవటంతో కన్నతల్లిదండ్రులు పడే బాధ ఏ దేవుడు తీర్చలేనిది. తెలుగు బిడ్డలపై.. ఏ దేవుడికి కన్నుకుట్టిందో తెలియదు గానీ, ఒకేసారి 25 మంది తెలుగు నేల భావిపౌరులను జలసమాది చేసింది.
ఈ ఘటనపై మూడు రాష్ట్రాలు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాయి. కానీ ఇప్పటికి విద్యార్థుల దేహాలను వెలికి తీసే పనిలోనే ఉన్నారు. అయితే హిమాచల్ ప్రభుత్వం నదిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు 1.5 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.
ఇదే బాటలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమ రాష్ట్ర పరిదిలోకి రాకపోయిన, ఒక ప్రజా నాయకుడిగా, నదిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షలు చొప్పన పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా, తన టీమ్ లో ఉన్న మంత్రులను హిమాచల్ కు పంపించి, విద్యార్థులకు తల్లిదండ్రులకు, సహాయ సేవలు అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేక విమాన సదుపాయం కలిపించారు చంద్రబాబు.
అయితే ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిహారం ప్రకటించలేదు గానీ, నదిలో మరణించిన విద్యార్థుల కోసం.. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డిని హిమాచల్ లోని బియాస్ నది వద్దకు పంపించి, విద్యార్థుల దేహాలను హైదరాబాద్ తెచ్చేందుకే, నదిలో గాలింపు చర్యల్లో తీవ్రమైన కృషి చేస్తున్నారు. హిమాచల్ అధికారులతో కలిసి నాయిని నర్సింహ రెడ్డి రాత్రి పగలు కష్టపడుతున్నారు.
ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు, నేతలు చేసిన విషయాలే మనకు తెలుసు. కానీ ఎవరికి తెలియని నిజం ఈరోజు బయట పడింది. ‘‘పవన్ అంటే పది మందికి ఉపయోగపడే పవర్ ’’ అని మరోసారి నిరూపించారు ‘‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయ పార్టీ పెట్టినప్పటికి.. ఎక్కడ రాజకీయం చేయలేదు. పదవి కోసం పాడు పనులు చేయాలేదు. పవన్ కు తెలిసిందే ఒక్కటే... తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు , తెలుగు బిడ్డలకు సేవ చేయలనే ఆశ ఆయనలో అణువు.. అణువు నిండిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పాలనలో నరకం అనుభవిస్తున్న తెలుగు ప్రజలకు విముక్తి కల్పించారు.
పవన్ కళ్యాణ్ .. హిమాచల్ లోని బియస్ నదిలో 25 మంది తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి.. ఆ రోజు నుండి అల్లాడిపోయినట్లు సమాచారం. కన్న బిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రుల అనుభవిస్తున్న బాధను తలచుకొని, పవన్ అనేక సార్లు బాదపడినట్లు తెలుస్తోంది. తెలుగు నేల బంగారు బిడ్డలను కోల్పోయిన కుటుంబాలకు తన వంతు సాయం చేయాలని ఉద్దేశంతో పవన్ మరో అడుగు ముందుకేసారు.
పవన్ ఒక మంత్రి కాదు, ఒక రాజకీయ నాయకుడు అంతకంటే కాదు, కేవలం ఒక ‘‘కామన్ మ్యాన్ ’’. కష్టాలలో ఉన్న వారి కన్నీళ్లు తుడిసే సామాన్య పౌరుడు. ‘‘చేగువీరతో చెలిమి లేకపోయినా’’, సేవ చేయాలనే గుణం టన్నుల కొద్ది ఆయనలో ఉంది. అందులోను తెలుగు వారికి సేవ చేయటం అంటే మహా ఇష్టం. అందుకే ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు అకాల మరణం పొందటంతో, వారి కన్నవారి కలలు.. గాలిలో కలిసిపోయాయి.
దీంతో పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాలకు పెద్ద కొడుకు బాద్యత తీసుకున్నాడు. తన కుటుంబాలను తానే ఆదుకోవాలనే ఉద్దేశంతో.. నదిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షలు చేయూత అందించారు. ఆ కుటుంబాలకు పెద్ద కొడుకుగా.. ఉడతా భక్తి సాయం చేసేడే తప్పు.. ఏదో రాజకీయం ఆశించి కాదు. మానవత విలువలు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ . ‘‘పశ్నించటమే కాదు.. పదిమందికి సాయం అందిచటంలో కూడా ముందే ఉంటానని నిరూపించారు’’.
పవన్ ఏదో.. ఈ సాయం చేశాడు కాబట్టి ఆయన గురించి చెప్పటంలేదు. ‘‘పువ్వు పుట్టగానే పరిమళించును’’అన్న సూక్తి గుర్తుకు వచ్చి చెప్పటం జరిగింది. పవన్ తో ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయిన, ప్రజల మనిషిగా ఆయన ఎదిగిపోయాడు అని చెప్పటానికి ఇదే నిదర్శనం. పవన్ కు ఎలాంటి ఆస్తులు లేవు, ఎలాంటి కుంభకోణాలు చేయలేదు, అవినీతికి ఆశపడి అర చేయి చాపలేదు. కానీ పవన్ కష్టపడి చెమటోడ్చిన సొమ్మును, తెలుగు కుటుంబాలకు చేయూత ఇవ్వటం అనేది నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే.
మన రాష్ట్రంలో లక్షల కోట్లు మింగిన బడా రాజకీయ తిమింగళాలు చాలా ఉన్నాయి. కానీ వారికి సొంత లాభం కావాలి? అక్రమాకంగా సంపాదించుకోవటానికి అధికారం కావాలి? కానీ పదిమందికి సాయం చేయటానికి వారి చేతిలో చిల్లి గవ్వకూడా ఉండదు. అదే వారి ఓదార్పు యాత్రలకు అయితే .. కోట్లు కోట్లు కుమ్మరించి ప్రజల మద్య తిరుగుతారు. ‘‘మనిషై పుట్టాక..కొంత కళపోషణ’’ ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. కానీ వీరికి మాత్రం అధికారం కావాలి. గానీ ప్రజల కష్టాసుఖాలను పంచుకునే సమయమే దొరకదు. కొన్ని జీవితాలు అంతే.. అవి ఎప్పటికి మారావు.
ప్రజల మనిషి అంటే..పవన్ కళ్యాణ్ లా ఉండాలి. పగవాడైన పలకరిస్తే.. పలికే మంచి గుణం పవన్ కళ్యాణ్ లో ఉంది. అధికారం ఆయన ముందుకు వచ్చినా, ‘‘ఆరడుగుల దూరంలోనే ఉంచాడు’’గానీ ఆశపడి పవన్ పరుగులు తీయలేదు. పవన్ ఒక్క అడుగు వేసాడు కాబట్టి, టాలీవుడ్ నుండి మరో పది అడుగులు తప్పకుండా పడతాయి. బియాన్ నదిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఎలాంటి ప్రాంతీయ బేధం లేకుండా.. మనుసున్న ప్రతి తెలుగు వ్యక్తి తప్పకుండా ఆదుకోవాలని పవన్ అభిమానులు కోరుతున్నారు.
తెలంగాణ తల్లైన, ఆంద్ర తల్లైన,‘ అమ్మ’ అనే పిలుపు ఒక్కటే . మన తల్లుల బాధను మనం పంచుకుందాం...రండి..., బియాన్ నదిలో మరణించిన విద్యార్థుల కుటుంబాల తల్లిదండ్రులకు అభయ హస్తం ఇద్దాం. నా తల్లి తెలంగాణ అయినా, నా అమ్మ ఆంద్ర అయినా, మనమందరం ..తెలుగు నేల బిడ్డలం, తెలుగు జాతి పౌరులం. తెలుగు అన్నదమ్ములం. ఇది తెలుసుకొని బతకటం నేర్చుకోవాలి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more