Jagan meets modi to offer his support

Jagan meets Modi to offer his support, YSRCP President Jagan meets Modi, BJP not to take Jagan support

Jagan meets Modi to offer his support

మోదీతో ఆశాజనకంగా లేని జగన్ భేటీ

Posted: 05/20/2014 10:21 AM IST
Jagan meets modi to offer his support

సోమవారం వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ కాబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయనకు అభినందనలు తెలియజేసారు.  అఖండ విజయం సాధించిన మోదీని అభినందించటానికి ఎందరో నాయకులు వరుస కడుతున్న సమయంలో జగన్ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా కలవటానికే పరిమితమైందని, జగన్ తన మనసులోని మాటలన్నీ చెప్పలేకపోయారని తెలుస్తోంది.  

భేటీ తర్వాత బయటకు వచ్చిన జగన్, తాను మోదీకి ఏ విషయంలోనైనా అవసరమైనప్పుడు మద్దతు తప్పక ఇస్తానని చెప్పానని, అయితే ఆయనకు ఎవరి మద్దతు అవసరం లేని స్థితిలోనే ఉన్నారని చెప్పారు.  

వైయస్ జగన్ తన పార్టీ నాయకులతో ఢిల్లీలోనే మకాం వేసి మోదీతో పాటుగా ఇంకా భాజపా నాయకులను కలిసి మాట్లాడదామని ఆశించారు.  అయితే భాజపా నాయకులు ప్రస్తుతం ఇతర నాయకులను కలవటంతో పాటు మంత్రివర్గాన్ని తయారుచెయ్యటంలో వ్యస్థులైవున్నారు.

మోదీతో భేటీకి ముందు రాష్ట్ర విభజన విషయంలో జరిగిన అవకతవకలను ఆయనకు వివరిస్తానని, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో త్వరితగతిని కొలిక్కి తీసుకునిరమ్మని కోరుతానని మీడియాలో తెలియజేసారు.  కానీ మోదీతో భేటీ సంతృప్తికరంగా లేదని ఆయన మాటల్లో అర్థమౌతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles