Naidu is back jagan go back to jail

Naidu is Back,Jagan go back to jail, TDP, YS Jagan, Go Back To Jail, No odarpu for Jagan, Face Book Page

YS Jagan Will Go Back To Jail. On the official Face Book page of Telugu Desam Party, it was posted that Jagan would go back to jail in 45 days.

నాయుడు ఈజ్ బ్యాక్...రెడ్డి బ్యాక్ టు జైల్ ???

Posted: 05/19/2014 04:01 PM IST
Naidu is back jagan go back to jail

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి 2014 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పట్టం కట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రపద్రేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బాబు పై సోషల్ మీడియాలో ‘నాయుడు ఈజ్ బ్యాక్ ’’ అనే క్యాన్షన్ తో విషెష్ చెబుతున్నారు. దానికి ధీటుగా కొంత మంది ‘‘ రెడ్డి బ్యాక్ టు జైల్  ’’  అంటూ ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అవినీతి పరుల అంతు చూస్తామని, తాము అధికారంలోకి వస్తే అవినీతి పరుల్ని జైళ్ళకు పంపడమే కాకుండా, వారి ఆస్తుల్ని జప్తు చేసి పేదలకు పంచుతామని చెప్పాడు. సీమాంధ్రలో బాబు అధికారం చేపట్టబోతుంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న వైయస్సార్ పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని గతంలో జైలు జీవితాన్ని గడిపి, బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

సీమాంధ్రలో ఎలాగైనా అధికారంలోకి వస్తామని మొన్నటి వరకు ధీమాగా వైయస్సార్ సీపీ నాయకులు ఇప్పుడు ఓటమి బాధలో కుంగిపోతుంటే బాబు అదికారం చేపట్టిన తరువాత పాత కేసుల్ని తవ్వి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను, పార్టీలో అవినీతికి పాల్పడిన నేతల్ని గ్యారెంటీగా జైళ్ళకు పంపడం కనిపిస్తుంది త్వరలో అధికారం చేపట్టబోతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్ని బట్టి.

ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాణించలేదనీ, అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఉనికి అనేదే ప్రశ్నార్థకమని ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే సాధ్యమైనంత తొందర్లో పాత కేసుల్ని తెర పైకి తెచ్చి జగన్ ని జైల్లో తోయడం ఖాయంగా కనిపిస్తుంది. అదే గనుక జరిగితే... తమిళనాడులో జయకు, కరుణానిధికి మధ్య లాగా రివేంజ్ రాజకీయాలు మన ఎపీలో తెరలేవడం ఖాయం అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles