Ysrcp waiting for tdp final list of candidates

YSRCP waiting for TDP final list of candidates, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

YSRCP waiting for TDP final list of candidates contesting 2014 elections

తెదేపా అంతిమ జాబితా కోసం వైకాపా ఎదురుచూపులు

Posted: 04/14/2014 10:59 AM IST
Ysrcp waiting for tdp final list of candidates

ఇప్పటి వరకు మూడు విడతలుగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.  84 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 74 స్థానాలకు తెదేపా అభ్యర్థులను ప్రకటించటం మిగిలివుంది. 

చంద్రబాబు నివాసం దగ్గర టికెట్ లభించని నాయకుల మద్దతుదారుల నిరసనలు ఇంకా కొనసాగుతూనేవున్నాయి.  ఎన్నికల బరిలో దిగటానికి ఎదురు చూస్తున్న తెదేపా నాయకులే కాక ఇతర పార్టీలు కూడా అభ్యర్థుల జాబితా కోసం ఎదురుచూస్తున్నాయి.  అందులో తెదేపాకు ప్రధాన పోటీయైన వైయస్ఆర్ కాంగ్రెస్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. 

వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నంలో ఎక్కడెక్కడ ఏ కులానికి చెందిన నాయకులకు ఇవ్వాలి, అందులో మహిళలకెన్ని సీట్లివ్వాలి అన్నదానిలో జరుగుతున్న కసరత్తు వలనే అభ్యర్థుల జాబితాను ఖరారు చెయ్యటంలో జాప్యం జరుగుతోంది. 

తెదేపా అభ్యర్థుల విషయంలో తేలేంత వరకు తమ అభ్యర్థులను ఖరారు చెయ్యగూడదనుకున్నట్లుగానే వైకాపా సీమాంధ్ర లో అభ్యర్థుల జాబితాను విడుదల చెయ్యటంలో ఆలస్యం జరుగుతోంది.  అదే తెలంగాణా విషయానికి వచ్చేసరికి వైకాపాకి అభ్యర్థుల నిర్ణయం చాలా సులభమైపోయింది. 

Related article

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles