Accidental prime minister book by sanjay baru

Accidental Prime Minister book by Sanjay Baru, Sonia Gandhi, Rahul Gandhi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Accidental Prime Minister book by Sanjay Baru

యాక్సిడెంట్ వలన మరణించేది కొందరే..

Posted: 04/14/2014 08:12 AM IST
Accidental prime minister book by sanjay baru

ఆదివారం కర్నాటకలోని చిక్క మగళూరులో బహిరంగ సభలో ప్రసంగించిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని "యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" గా అభివర్ణించిన మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు రాసిన పుస్తకం లోంచి తీసుకుంటూ, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని గద్దెనెక్కించటం కోసం దేశాన్ని సర్వనాశనం చెయ్యటానికి కూడా తయారయ్యారని, యుపిఏ ప్రభుత్వాన్ని రిమోట్ తో నియంత్రిస్తున్నారని, ప్రధానమంత్రి నామమాత్రంగానే పనిచేస్తున్నారని విమర్శించారు.

మన్మోహన్ సింగ్ నిస్సహాయతల గురించి రాసిన ఆ పుస్తకం టైటిల్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ, రైలు, బస్సు ప్రమాదాలలో కొందరే మరణిస్తారు కానీ ఇలాంటి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ వలన 125 కోట్ల జనాభా గల దేశానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన అన్నారు. 

ఇచ్చిన హామీలనే తుంగలో తొక్కిన కాంగ్రెస్ ఇప్పుడు మైనారిటీల సంక్షేమానికి 15 సూత్రాల పథకం జపం చేస్తోందని, అవన్నీ కల్లిబొల్లి మాటలని వాటిని నమ్మవద్దని, కాంగ్రెస్ ని ఈసారి చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. 

ప్రధాన మంత్రి సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ప్రధానమంత్రి కార్యాలయం పనిచేసే తీరు, గోప్యతా నియమాలను ఉల్లంఘించి ప్రధానమంత్రి కార్యాలయం సోనియా గాంధీకి చేరవేస్తున్న వివరాల విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేసారు.  అందులో చాలా విషయాలు ప్రతిపక్షమైన భాజపాకి ఉపయోగపడుతున్నాయి.

అయితే విచిత్రమేమిటంటే, సంజయ్ బారు వెల్లడి చేసిన వివరాలు కొత్తవి కావటమే కాకుండా వివరణాత్మకంగా ఉండటమే కాకుండా చదివినవారికి ఔను ఇది నిజమే కదా అనిపించేట్టు ఉన్నాయి. కొత్త విషయమేదో తెలుసుకుంటున్నట్లుగా అధిక శాతం పాఠకులకు అనిపించటం లేదని చెప్తున్నారు.  వివరంగా తెలియకపోయినా, ప్రధానమంత్రికి ఎటువంటి అధికారాలూ లేవని, నడిపించేదంతా యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీయే అన్న విషయం ఎప్పటి నుంచో అర్థమౌతూనే ఉందని వారు అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles