Trs secret pact with ysrcp

TRS secret pact with YSRCP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

TRS secret pact with YSRCP

తెరాస తెరవెనక పొత్తు వైకాపాతో?

Posted: 04/12/2014 09:45 AM IST
Trs secret pact with ysrcp

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా గట్టిగా పోరు సలిపిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పోటీ చెయ్యదని, సీమాంధ్రలో మాత్రమే పోటీ చేస్తుందని ఊహించినవారికి ఆ పార్టీ తెలంగాణాలో దాదాపూ అన్ని స్థానాలలోనూ పోటీకి అభ్యర్థులను నిలబెట్టటం రాజకీయరంగంలో అందరినీ విస్మయపరచినట్లే కనిపిస్తోంది ఒక్క అందుకు సహకరించిన పార్టీకి తప్ప. 

మిగతా ఏ పార్టీల మీద విరుచుకుపడ్డా తెరాస వైకాపా మీద పెద్దగా వ్యాఖ్యానాలు చెయ్యకపోవటం గమనార్హం.  తెలంగాణాకు మేము వ్యతిరేకం కాదు అని తెలుగు దేశం పార్టీ లిఖితపూర్వకంగా ఇచ్చినా తప్పు పట్టిన తెరాస, తెలంగాణాకు మేము వ్యతిరేకమంటూ రాజీనామాలు చెయ్యటం, దీక్షలు చెయ్యటం, సుప్రీం కోర్టులో విభజనకు వ్యతిరేకంగా పిటిషన్ లు వెయ్యటం చేసిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ మీద, పార్టీ నాయకుడి మీదా ఎప్పుడూ విరుచుకుపడకపోవటం కూడా గమనించదగ్గదే. 

వైకాపాకు తెలంగాణాలో అన్నిచోట్ల పార్టీ కార్యాలయాలు, కార్యకలాపాలు, ప్రచారాలు లేకపోయినా తెలంగాణాలో మొత్తం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 106 చోట్ల, 17 పార్లమెంట్ స్థానాలకు 13 చోట్ల అభ్యర్థులను నిలబెట్టటం కాంగ్రెస్ పార్టీనైతే షాక్ కే గురిచేసినట్లుగా కనిపిస్తోంది.  ఎక్కడ ఎవరిని నిలబెట్టాలా అని అభ్యర్థుల ఎంపికలో మిగతా పార్టీలు తలమునకలవుతుంటే వైకాపా మాత్రం కూల్ గా కాండిడేట్స్ ని ప్రకటించేసింది.  దీనితో, గెలుపు కోసం కాదని వైకాపా కేవలం కాంగ్రెస్ వోట్లను చీల్చటమే లక్ష్యంగా, పరోక్షంగా తెరాసకు మేలుచేసే విధంగా చేసిన పన్నాగమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలలో కూడా ఏ అభ్యర్థిని నిలబెట్టాలన్నది తెరాస యువనాయకుడు సూచించిన మేరకే వైకాపా దాన్ని అనుసరించిందని సమాచారం.  అంతకు ముందు వైకాపాలో ఉన్న వైయస్ఆర్ అభిమానులు, క్రిస్టియన్ మైనారిటీ వర్గానికి చెందినవారు ఆ పార్టీ సమైక్యాంధ్రకు బాహాటంగా మొగ్గు చూపించటంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  వాళ్ళ వోట్లను చీల్చటమే ప్రధాన లక్ష్యంగా వైకాపా అభ్యర్థులను నిలబెట్టిందని, దానితో కాంగ్రెస్ కి రావలసిన వోట్లు తగ్గిపోయి ఆ విధంగా పరోక్షంగా తెరాసకు లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ నాయకులు కూడా అర్థం చేసుకున్నారు.  వైకాపా లోంచి తెరాసలోకి వలసపోవటానికి కూడా జగన్ ప్రోత్సహించారని కూడా వినపడుతోంది.  అంతేకాకుండా నిజామాబాద్ నుంచి పోటీ చెయ్యటానికి సిద్ధపడ్డ షర్మిల ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం కూడా తెరాస కు మద్దతునివ్వటానికే అని అర్థమౌతోంది.  హైద్రాబాద్ లో తెలంగాణాలో కొన్ని ప్రాంతాలలో దీక్ష చేస్తున్న సమయంలోను, సమైక్యాంధ్ర సభను హైద్రాబాద్ లో పెట్టిన సమయంలోనూ తెరాస సహకరించిందనే మాటను కూడా చాలా మంది చెప్పుకున్నారప్పట్లో.

అయితే వ్యూహప్రతివ్యూహాలు కాంగ్రెస్ కి కొత్తేమీ కాదుగా.  నెమ్మదిగా వైకాపా అభ్యర్థులను తమవైపు తిప్పుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. 
రసకందాయంలో పడుతున్న ఎన్నికల ప్రక్రియ పూర్తయే లోపులో చూడాలి ఇంకా ఎన్ని రకాల వ్యూహరచనలు జరుగుతాయో. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles