Sonia gandhi powerful speech on telangana bill in lok sabha

sonia gandhi, telangana bill, sonia gandhi powerful speech in lok sabha, congress party, cm kiran kumar reddy, andhra pradesh, cm kiran resigned, ap bifurcation.

sonia gandhi powerful speech on Telangana bill in lok sabha

అమ్మ అంతిమ తీర్పు-‘ఆంద్ర ’-కిరణ్ కు ఆఖరిరోజు

Posted: 02/18/2014 11:41 AM IST
Sonia gandhi powerful speech on telangana bill in lok sabha

ఈరోజు  చరిత్రలో నిలిపోతుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  ఈరోజు  లోక్ సభలో.. తెలంగాణ బిల్లుపై  తొలిసారి ఏకదాటిగా నాలుగు గంటలు మాట్లడే సమయం ఉంది. కానీ   కాంగ్రెస్ పార్టీ అథినేత్రి  సోనియా  గాంధీ  ఎన్ని గంటలు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, తెలంగాణ సమస్యపై ఏం చెబుతారని,  ఆంద్రప్రదేశ నాయకులు ,  దేశ ప్రజలు  ఆసక్తిగా చూస్తున్నారు.  సోనియా ప్రసంగం పైనే  రెండు ముఖ్యమైన ఘట్టలకు ఆఖరి రోజు అవుతుంది. 

సోనియా గాంధీ  2004లో  కరీంనగర్ జిల్లా మొదటి సారి  తెలంగాణ పై మాట్లాడిన విషయం తెలిసిందే.  ఇప్పుడు  లోక్ సభలో తెలంగాణ పై మాట్లాడటానికి  సిద్దమవుతుంది.  అయితే  తెలంగాణ పై సోనియా గాంధీ ఈరోజు  అంతిమ తీర్పు ఉంటుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 సోనియా గాంధీ అంతిమ తీర్పుతో.. ఆంద్రప్రదేశ్   విడిపోవటం,  రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి  కిరణ్ కుమార్ రెడ్డికి  ఆఖరి రోజు కావటం, అన్నింటికి  ఒకే రోజు కావటంతో.. రాజకీయ నాయకుల్లో ఆందోళన మొదలైంది.

 తెలంగాణ పై సోనియా గాంధీ అంతిమ తీర్పు  ఏమిటి?  తెలంగాణ ఇస్తే.. సీమాంద్ర ప్రజలకు  ఎలా న్యాయం చేస్తుంది?   సోనియా గాంధీ ప్రసంగాన్ని  సీమాంద్ర ఎంపీలు , సీమాంద్ర మంత్రులు వింటారా?  లేక  అడ్డుకుంటారా?   రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజు ఆఖరి రోజు  అని  రాజకీయ నాయకుల్లో  ప్రచారం జరుగుతుంది.  

ఈరోజు  సీఎం కిరణ్  ఎన్ని గంటలకు  రాజీనామా చేస్తారు?  అనే ప్రశ్నలకు  జవాబుల కోసం  రాజకీయ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.  

సోనియా గాంధీ అంతిమ తీర్పుతో..  తెలంగాణ రాష్ట్రం  వస్తుందని.. తెలంగాణ ప్రజలు , తెలంగాణ నాయకులు  ఆనందంగా ఉన్నారు.  అలాగే  సీమాంద్ర నాయకులు  సోనియా గాంధీ అంతిమ తీర్పుతో.. ఆంద్రప్రదేశ్  రెండు ముక్కలు అవుతుందని సమైక్య వాదులు ఆందోళన చెందుతున్నారు.

 సోనియా గాంధీ అంతిమ తీర్పుతో  సిఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.   అయితే సీమాంద్ర నాయకులు, సమైక్య వాదులు ..  తెలంగాణ బిల్లు ను అడ్డుకోవటానికి  చివరి ప్రయత్నం చేయటానికి సిద్దంగా ఉన్నారు.

 సీమాంద్ర నాయకులకు.. ఇదే  చివరి అవకాశం, ఇదే చివరి రోజు అవుతుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  ఈరోజ 12 గంటల తరువాత   లోక్ సభలో  సోనియా గాంధీ అంతిమ తీర్పు లో ఏం జరుగుతుందో  చూద్దాం... 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles