ప్రపంచ చరిత్రలో మొట్ట మొదటి సారిగా.. ఏనుగు ను ఉరితీశారు. 1916 ఫిబ్రవరి తేదీన చార్జీ స్పార్క్స్ సర్కస్ కంపెనీ చెందిన మేరీ అనే ఏనుగును ఉరి తీయటం జరిగింది. ఆ ఏనుగు చేసే విన్యాసాలు చూసి సర్కస్ కు వచ్చే ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టేవారు.
అలాంటి ఆ ప్రజల మద్యలోనే ఏనుగు ను ఉరితీయ్యాలని ఆ దేశ అధికారి ఇష్టంలేని తీర్పు ఇవ్వటం జరిగింది. అప్పటి వరకు దాని విన్యాసాలకు చప్పట్లు కొట్టిన వారే.. ఆ ఏనుగు ఉరి తీయ్యాలని నినాదాలు చేశారు. ప్రపంచంలో ఓ ఏనుగును ఉరి తీసిన ఏకైక పట్టణం ఎర్విన్. ఇదే రీతిలో ఆంద్రప్రదేశ్ పై సోనియా గాంధీ ?
పై కథ ఎందుకు చెప్పానంటే.. ఆంద్రప్రదేశ్ లో కూడా ఇలాంటి తీర్పు చేయటానికి సిద్దమైన సోనియా గాంధీ. ఆంద్రప్రదేశ్ ప్రజల ఓట్లతో.. పదేళ్ళు అధికారం లో ఉండి మళ్లీ అధికారం కోసం ఆంద్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేయటానికి ఈరోజు సోనియా గాంధీ ఇష్టంలేని తీర్పు చెబుతుంది. కేవలం ఇది సోనియా గాంధీ ఇగో తీర్పుని .. రాజకీయ మేథావులు అంటున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి 33 మంది ఎంపీలను ఇచ్చి, మిమ్మల్ని అందలం ఎక్కిస్తే.. చివరకు ఆంద్రప్రదేశ్ ప్రజలు మద్య చిచ్చు పెట్టి, రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజిస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఎక్కడైన ఉందా? అని రాజకీయ మేథావులు అడుగుతున్నారు.
సోనియా గాంధీ తీరు చూస్తుంటే.. ఒక సామెత గుర్తుకు వస్తుంది.. ‘‘ కూర్చున్న చెట్టుకొమ్మను తెగనర్కుకోవటం అంటే ఇదే’’అసలు తెలుగు ప్రజలు ఏం అన్యాయం చేశారు? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకా? ఆంద్రప్రదేశ్ పై ఇంత ఇగో ఫీలింగ్ దేనికని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు.
తెలుగుప్రజలు మద్య ప్రత్యేక వాదం అరవై సంవత్సరాల నుండి సమస్యే. ఎన్నో సార్లు కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది. (అప్పడు సోనియా గాంధీ రాజకీయల్లోకి రాలేదు) ఎంతో మంది రాజకీయ పండితులు, రాజకీయ ఉద్దాండులు, ఈ భూమి పై పుట్టిన మహ మహ రాజకీయ మేథావులు చేయలేని సాహసాన్ని .. కేవలం.. అధికారం పోతున్న ఆఖరి రోజుల్లో.. ఏం చేస్తున్నావని సీనియర్ రాజకీయ పండితులు అడుగుతున్నారు.
మీకు నిజంగా తెలంగాణ ఇవ్వాలని ఉంటే.. 9 సంవత్సరాలు ఏం చేశారు? తెలంగాణ సమస్య దేశంలో ప్రధాన సమస్యగా ఉందా? దేశంలో తెలంగాణ సమస్యను మించిన సమస్యలు చాలా ఉన్నాయి . కాశ్మీర్ సమస్య ఎప్పటి నుంచో అలాగే ఉంది. దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కరం లేదు. ఒక పక్క శత్రువు దేశాలు .. మన సైనికుల తలలు నరికి తీసుకుపోతుంటే.. దిష్టిబొమ్మ మాదిరి చూస్తూ.. మౌనం పాటించిన మన్మోహన్ జీ? ఆ సమస్య కు ఏ పరిష్కరం తీసుకున్నారు.
అసలు ఆంద్రప్రదేశ్ ను రెండు ముక్కలుగా విడదీస్తే.. కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఈ ప్రయోజం దేశానికి ఏమాత్రం ఉపయోగపడుతుంది? కేవలం మీరు అధికారంలోకి రావటానికి, మీ పదవులను కాపాడుకోవటానికి, సోనియా గాంధీ కొడుకును ప్రధాన మంత్రి చేయటానికి ఉపయోగపడుతుందేమో తప్ప. అంటే మరో అయిదేళ్లు .. మీరు అధికారంలోకి రాగలరు. అంతేగానీ పెద్దగా ప్రయోజం లేదని రాజకీయ మేథావులు అంటున్నారు.
సీమాంద్ర ప్రజలకు న్యాయం చేయకుండా, సీమాంద్ర ప్రజలకు ఇష్టంలేని తీర్పు ఇవ్వటం వెనుక.. సోనియా గాంధీ ఇగో కనిపిస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇప్పుడైన తెలంగాణ బిల్లును ఆపే శక్తి సోనియా గాంధీ కే ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. గతంలో మహిళ బిల్లును పై సోనియాగాంధీ చేసిన హాడావుడి అంత ఇంత కాదని అంటున్నారు.
ఆర్థిక నిపుణుడైన మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్డినెన్స్ బిల్లు పై రాత్రి పగలు కసరత్తు చేసి ప్రవేశపెడితే.. యువనేత రాహుల్ గాంధీ ఆ బిల్లు చెత్త బిల్లు అని, చించి పారేస్తే ఆగిపోలేదా? ఆసమయంలో మన్మోహన్ సింగ్ కంటి అద్దాల చాటు దాగిన కన్నీటి గురించి రాహులకు తెలుసా? తన ముందే రాజకీయ ఓనమాలు నేర్పుకోని, తన పెట్టిన బిల్లునే చెత్త బిల్లు అన్నప్పడు.. మన్మోహన్ ఎంత క్షోభా అనుభవించి ఉంటారో సోనియా గాంధీ తెలుసా? ఇప్పుడైన సోనియా గాంధీ ఒక్క మాట చెబితే తెలంగాణ ఆగిపోతుంది.
కానీ ఆమె ఇగో దెబ్బ తింటుంది కాబట్టి , ఇష్టంలేని తీర్పు ఇవ్వక తప్పదని అర్థమువుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఇగో తీర్పును ప్రజలు ఇష్టపడరని సోనియా గాంధీకి తెలుసు. కానీ తన ఇగో దెబ్బ తినకూడదు కాబట్టి తెలంగాణ ఇస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
పై కథలో చెప్పినట్లు సహనంతో సాధు జంతువుల్లా ఉన్న సీమాంద్ర నేతలను క్రుర మ్రుగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు సీమాంద్ర ప్రజల, సీమాంద్ర నాయకులు మాటలు పట్టించుకోండి.. వారిని ఉరి తీస్తున్నారు. సోనియాగాంధీ ఇగో తోనే.. సీమాంద్ర ప్రజలను ఉరి తీస్తున్నారు.
సీమాంద్ర నాయకుల, ప్రజల ఆవేశం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో అందరికి చెప్పుకోనే, అడిగే అవకాశం ఉంటుంది. అలాగే సీమాంద్ర వారికి అవకాశం ఇవ్వండి. సీమాంద్ర నాయకుల పై పగతో, ఇగో తో, ఇష్టంలేని తీర్పు సీమాంద్ర ప్రజలపై రుద్దకండని..సోనియాకి సీమాంద్ర ప్రజలు కోరుతున్నారు.
ఇప్పుడు తెలంగాణ సమస్యకు పరిష్కరం చూపారు. రేపు ఆంద్ర నుంచి రాయలసీమ ప్రజలుకు ప్రత్యేకం కావాలంటే ఇలాగే విడదీస్తారా? ఆలోచించి నిర్ణయం తీసుకొని ..ఇరుప్రాంతాల ప్రజలకు న్యాయం చెయ్యండి. అంతేగానీ ఇష్టంలేని ఇగో తీర్పు ఇవ్వకండని సీమాంద్రలోని సమైక్యవాదులు అడుగుతున్నారు.
ప్రజస్వామ్యంలో.. ఏమైన జరగొచ్చు?
తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరాలను ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యలాని .. కాంగ్రెస్ (కట్ట) మైసమ్మలా కరుణించి .. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తావని వరం ఇచ్చావు. తెలంగాణ ప్రజలకు వరం ఇవ్వటం .. సీమాంద్ర ప్రజలకు ఆనందమే. కానీ ఇక్కడ సమన్యాయం చెయ్యకుండా, ఒక ప్రాంత ప్రజలకు బెల్లం, మరో ప్రాంత ప్రజలకు సున్నం పెడితే బాగుంటుందా? ప్రజాస్వామ్యంలో.. ఇరువురికి సమ న్యాయం జరగాలి.
ఇద్దరికి సమన్యాయం చేసి , విడదీస్తే అందరికి ఆనందంగా ఉంటుంది. అంతేగానీ.. తెలంగాణ ప్రజలు , సీమాంద్ర ప్రజలకు శత్రువులు కాదు. అరవైఏళ్ల నుంచి అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా, బావా మరుదుల్లా, తల్లి , పిల్లల్లా, తండ్రి కొడుకుల్లా, భార్య భర్తల్లా, మామ.. అల్లుడిలా కలిసి పోయి, భావ్య బంధాలు పెరిగిపోయాయి. అరవైఏళ్ల ప్రేమ బంధం, అనుబంధం, సంబంధం విడిపోతుందంటే.. ఎవరికైన బాదే ఉంటుంది.
రాజకీయ నాయకుల్లో .. శత్రువులు ఉన్నారేమో గానీ, ఇప్పటి వరకు రెండు ప్రాంతాల ప్రజల్లో మాత్రం శత్రువులు లేరు. కారణం ఒకరి పై ఒకరికి అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2009లో ప్రకటన చేశారు. ఆ నాటి నుండి ఈ నాటి వరకు తెలుగు ప్రజల మద్య ఆరని మంటలు రగిలించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో ఏమైన జరగొచ్చు.
కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నందకు అందరికి ఇష్టమే. కానీ ఇక్కడ తెలంగాణ ఇవ్వొద్దని ఎవరు అనటంలేదు. కానీ ఇద్దరికి సమన్యాయం చెయ్యాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది.
2009లో తెలంగాణ ఇవ్వకుండా సీమాంద్ర ప్రజలును దోషులుగా చూపించి, తెలంగాణ ప్రజల మనస్సులో విష బీజాలు నాటింది కాంగ్రెస్. నిన్నటి వరకు అభిమానంగా, అప్యాయంగా పలకరించే తెలంగాణ ప్రజలు నేడు సీమాంద్ర ప్రజలు ద్వేశిస్తున్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేసిన తప్పలకు.. ఇరుప్రాంతాల ప్రజలు నరకం అనుభవించాలా? కేవలం సీమాంద్ర ప్రజలు సమైక్యం అంటున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టింది.
అరవైఏళ్లు కలిసి ఉన్నవారు విడిపోతున్నరని తెలిసి, తట్టుకోలేక సమైక్యం అన్నారేగానీ.. మీకు తెలంగాణ ఇవ్వద్దు ఏ రోజై అన్నారా? ఇది కేవలం అధికారం కోసం , అహంకారంతో తెలుగు ప్రజలును విడదీస్తున్నారు. తెలుగు ప్రజలు పెద్ద రాష్ట్రం గా ఉన్నారు కాబట్టి, వారిని రెండు రాష్ట్రాలుగా విభజిస్తే.. భవిష్యత్తులో మనకు ఎలాంటి సమస్యలు ఉండవనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (ఇగో) ఇష్టంలేని తీర్పు ఇస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
ప్రజస్వామ్యంలో.. ఇలాంటి తీర్పు ఉండదని తెలుగు ప్రజలు అంటున్నారు. తెలంగాణ ఇవ్వటం వల్ల సీమాంద్ర ప్రజలు పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదు. కానీ రాజకీయ నాయకుల వల్ల, రాజకీయ పార్టీల వల్ల, ఇరుప్రాంతాల ప్రజల మనసులు గాయపడ్డాయి. అంతేతప్ప.. సీమాంద్ర ప్రజలు, తెలంగాణప్రజలు ఏప్పుడు కలిసే ఉంటారు.
రాష్ట్రాలుగా వేరుపోయిన .. అభిమానం, అప్యాయతల మద్య ఎప్పుడు కలిసే ఉంటారనే విషయం రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. జై తెలంగాణ .. జై జై తెలంగాణ, జై సమైక్యంద్ర, జై జై సమైక్యాంద్ర అన్న నినాదాలు చేసింది కూడా తెలుగుప్రజలే. రేపు విడిపోయి కలిసి ఉండేది కూడా తెలుగు ప్రజలే.
దేశంలోని ప్రజలందరు బాగుండాలని, ముఖ్యంగా తెలుగు వారు ఏ దేశంలో ఉన్న .. మన తెలుగు జాతి పేరును నిలబెడదాం. తెలుగువారి ఖ్యాతి పెంచుదాం. లౌక్యం తెలిచిన తెలుగు ప్రజలారా, తెలుగు తల్లి బిడ్డలారా? ప్రాంతాలు వేరైన, యాసలు ఎన్ని ఉన్నా, మన తెలుగు పరిమళం ఒక్కటే.
తెలంగాణ తల్లికైన, తెలుగుతల్లికైనా.. నా మల్లెపువ్వు దండ అని మనసారా పాడుకోండి? తెలుగు సువాసనలను ప్రపంచదేశాలకు వెదజల్లండి? తెలంగాణ అయిన, సీమాంద్ర అయిన .. తెలుగు వారికి ..రెండు కళ్లు లాంటివే అనే నిజం తెలుసుకోండి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more