Government bound to aadhar says chidambaram

Government bound to Aadhar says Chidambaram, Budget 2014, Union Finance Minister Chidambaram, Aadhar linked bank accounts, Aadhar data unprotected, Direct benefits in bank accounts

Government bound to Aadhar says Chidambaram, Budget 2014

ఆధార్ తో విడలేని బంధం- చిదంబరం

Posted: 02/17/2014 12:32 PM IST
Government bound to aadhar says chidambaram

ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆధార్ కార్డ్ కి ప్రభుత్వం కట్టుబడివుందని అన్నారు. 

ఆధార్ నమోదును తప్పనిసరి చెయ్యటం సరికాదని సుప్రీం కోర్టు హైకోర్టు లు ఎన్నిసార్లు తీర్పు నిచ్చినా ప్రభుత్వం మాత్రం రాయితీ సొమ్ములను నగద బదిలీలను ఆధార్ లింక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామని చెప్తోంది.  ఆధార్ నమోదు ద్వారా సేకరించిన వ్యక్తిగత డేటాకు రక్షణ విషయంలో పలువురు అభ్యంతరాలు తెల్పినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదు. 

కనీసం మీ డేటా సురక్షితం, అందుకు పూచీ మాది అన్న హామీలు ఎప్పుడూ ప్రభుత్వం తరఫునుంచి వెల్లడి కాలేదు.  నగదు బదిలీ కావాలంటే ఆధార్ తప్పని సరి, దానితో మీ బ్యాంక్ ఖాతాల లింక్ తప్పని సరి అంటూ ప్రజలచేత బలవంతంగా ఆధార్ మీద ఆధారపడేట్టు చేసింది ప్రభుత్వం. 

చిదంబరం చెప్పినదాని ప్రకారం ఇప్పటికే దేశంలో 57 కోట్ల మంది ఆధార్ డేటాబ్యాంక్ లోకి వచ్చారు.  27 పథకాల ద్వారా ప్రభుత్వం అందించవలసిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా జమకడుతున్నామంటూ ఆయన తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles