world bank | ap | disaster recovery | 15000cr loan | chandrababu naidu

World bank 15hundred crore loan to ap

world bank, ap, disaster recovery, 15000cr loan, chandrababu naidu

world bank 15hundred crore loan to ap. world bank loan to ap for disaster recovery purpose.

ఏపి ప్రపంచబ్యాంక్ 15వందలకోట్ల రుణం

Posted: 07/17/2015 08:33 AM IST
World bank 15hundred crore loan to ap

ప్రపంచ బ్యాంక్ అంటే తెలుగు వారికి ముందుగా గుర్తుకువచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రపంచ బ్యాంక్ ను మెప్పించి.. కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ అప్పులు తీసుకున్న చంద్రబాబు నాయుడుకు తాజగా అదే ప్రపంచ బ్యాంక్ అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు పునరుద్ధరణ పనులకు ప్రపంచబ్యాంకు బాసటగా నిలిచింది. విపత్తు పునరుద్ధరణ పనులకుగాను ప్రపంచ బ్యాంకు సుమారు 250 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో 1500 కోట్లకుపైగా రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌ సెల్వకుమార్‌, ప్రపంచబ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్‌ ఒన్నో రుల్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Also Read:  ఆ తప్పు చేసేందుకు సిద్దపడ్డ చంద్రబాబు..?

ఏపీ తరఫున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్‌ చందర్‌ శర్మ సంతకం చేశారు. ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపునకు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ నిధుల్ని వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు నేరుగా ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ, మొదలైన కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఐదేళ్ల కాలంలో ఏపీ సర్కార్‌ ఈ పనులు చేపట్టాల్సి ఉంటుంది.

Also Read: సొమ్ములెవరివో.. సోకులు చంద్రబాబువి

కాగా ఏపి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కాబట్టి కేంద్రం నుండి తక్షణ సహాయం కింద కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చెయ్యాలని ఏపి సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. గతంలోనూ లోటు బడ్జెట్ ను పూడ్చడానికి 23వేల కోట్లు కావాలని అడిగినా కేవలం 350 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తూ కేంద్రం ఏపికి మొండి చేయి చూపించింది. మరి తాజాగా కనీసం ఐదు వేల కోట్లు కావాలన్న ఏపి ప్రభుత్వ వినతి మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

By Abhinavachary

Also Read:  చంద్రబాబు ఓ శాడిస్టు..!
Also Read:  ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది- ప్రపంచ బ్యాంకు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world bank  ap  disaster recovery  15000cr loan  chandrababu naidu  

Other Articles