TSPSC | Recruitment | Vittal | Jobs | Notification

Everything ready for telangana recruitment vittal

TSPSC, Recruitment, Vittal, Jobs, Notification

Everything ready for Telangana recruitment Vittal TPSC member Vittal said that everything ready for telangana recruitment.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అంతా రెడీ: విఠల్

Posted: 07/17/2015 08:46 AM IST
Everything ready for telangana recruitment vittal

న్యాయపరమైన చిక్కులను అధిగమించి త్వరలోనే ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ పేర్కొన్నారు. వయోపరిమితి సడలింపు విషయంలోనూ డిప్యూటీ సీఎం అధ్యక్షతన వేసిన కమిటీ ఐదేళ్ల అవకాశం ఇచ్చిందన్నారు. డిపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలను రికార్డు స్థాయిలో కేవలం 12 రోజుల్లోనే విడుదల చేశామని గుర్తుచేశారు. రానున్న నోటిఫికేషన్ల విషయంలోనూ పారదర్శకంగా, న్యాయ, చట్టపరంగా వ్యవహరిస్తామన్నారు. ఉద్యోగుల భర్తీలో వ్యక్తిగతంగా తాను జోనల్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటానన్నారు. దీని వల్ల వెనుకబడిన ప్రాంతాల్లోని యువతకు అవకాశాలు వస్తాయన్నారు.

Also Read:  తెలంగాణ ఉద్యోగ ప్రకటనలకు అంతా సిద్దం
Also Read:  ఎప్పుడెప్పుడు.. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు..?

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీపై అధికార యంత్రాంగం ఎక్సర్ సైజ్  చేస్తోంది. జూలై లేదా ఆగస్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలచేస్తామని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు అనుగుణంగా అన్నిశాఖల అధికారులు తమతమ శాఖల్లోని ఖాళీల వివరాల సేకరణను ఇప్పటికే దాదాపు పూర్తిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు అన్ని శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అప్‌లోడ్ చేశారు. మొత్తం ఖాళీలు సుమారు 50 వేలకు చేరినట్లు సమాచారం.అయితే నూతన పరీక్షా విధానం, వయోపరిమితి సడలింపు, జోనల్ విధానం, రోస్టర్ పాయింట్ల అంశాల్లో స్పష్టత లేకపోవటంతో నోటిఫికేషన్ల జారీ ఆలస్యమవుతున్నట్లు తెలిసింది.

Also Read:  తెలంగాణలో జాబుల జాతర.. జూన్ 2న ముహూర్తం..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి  జోనల్, మల్టీ జోనల్, జిల్లా స్థాయిల్లోని పోస్టులు మాత్రమే కనిపించనున్నాయి. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే రాష్ట్ర స్థాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. మరోవైపు ఖాళీలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆయా శాఖల నుంచి రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చాకే మొదటి విడతలో ఎన్ని ఖాళీల్లో నియామకాలు చేపడతారో స్పష్టమవుతుంది. అయితే పోస్టులను మొత్తం ఐదు క్యాటగిరీలుగా విభజించి ప్రాధాన్యత ప్రకారం వాటిని భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ నెల చివరలో లేదంటే వచ్చే నెల రెండో వారంలోపు ఉద్యోగార్థులు జాబ్ నోటిఫికేషన్ ను ఆశించవచ్చిన సమాచారం.

By Abhinavachary

Also Read:  ఈ నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  Recruitment  Vittal  Jobs  Notification  

Other Articles