chandrababu | ap | crisis | budget | timesnow | media, 100cr, chandrababu tour

Chandra babu naidu spends crores on himself despite worst financial crisis in andhra pradesh

Chandrababu naidu bildup, chandrababu, ap, crisis, budget, timesnow, media, 100cr, chandrababu tour

CM Naidu Spends Crores On Himself Despite Worst Financial Crisis In Andhra Pradesh. Andhra Pradesh is facing its worst financial crisis in 10 years. The government had recently borrowed Rs 490 crore from the Reserve Bank of India. In January, Chief Minister Chandrababu Naidu claimed government staff salaries would not be paid as the State could not afford it.

ITEMVIDEOS: సొమ్ములెవరివో.. సోకులు చంద్రబాబువి

Posted: 07/13/2015 12:36 PM IST
Chandra babu naidu spends crores on himself despite worst financial crisis in andhra pradesh

మింగ మెతుకు లేదుగానీ మీసాలకు సంపంగె నూనె అని తెలుగులో సామెత ఉంది. తల్లికి కూడు పెట్టలేదు కానీ పినతల్లికి మాత్రం బంగారు గాజులు కొనిస్తాన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఏపి సిఎ: చంద్రబాబు నాయుడు. సినిమా్లో చూపించే బిల్డప్ రాయుడు లాగా చంద్రబాబు నాయుడు ఎంతలా బిల్డప్ ఇస్తారో అందరికి తెలుసు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది ఏపి ప్రజల పరిస్థితి. ఎందుకంటే అసలే కష్టాల సుడిగుండంలో ఉన్నాం, విభజన వల్ల చాలా నష్టనోయాం అనుకున్న ఏపి ప్రజలు మంచి చేస్తారని చంద్రబాబు నాయుడును గెలిపించారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అసలు విషయాన్ని మరిచిపోయి... డబ్బా బాబులాగా తయారయ్యారు.

 

Also Read:  ఇదేం నీతి, ఏదీ నిజాయితీ..? బాబు గారు..

ఏం చేసినా రాయల్ గా ఉండాలి. తినడానికి తిండి లేకున్నా పర్వాలేదు కానీ రాయల్టి మాత్రం మిస్ కావద్దు అన్నట్లు చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తున్నారు. నేను మీ కోసం ఉన్నాను. భయపడకండి.. అంటూ భరోసా ఇచ్చిన ఆ చంద్రబాబు నాయుడే ప్రజల సొమ్మును నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న రూపాయి ఖర్చు రేపటి వంద రూపాయలకు నాంది అన్నట్లు చెప్పు బాబు గారు ఆ మాటలను మరోలా వాడుతున్నారు. ఎక్కడైనా డబ్బులు లేవు బాబు అంటూ అడుక్కోవడానికి వెళ్లినప్పుడు సాదాసీదాగా వెళతారు. కానీ చంద్రబాబు మార్క్ మాత్రం వేరే. మందీమార్భలంతో.. భారీ తతంగంతో రంగంలోకి దిగుతారు.

 

chandra-babu-bildup02

సింగపూర్ కు చంద్రబాబు బయలుదేరారు అంటే సపరేట్ గా ఛార్టడ్ ఫ్లైట్, ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సిందే. ఇక వెంట వెళ్లే అధికార యంత్రాంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు అదే సింగపూర్ కు రెగ్యులర్ ఫ్లైట్ సర్వీసులు ద్వారా తక్కువ మంది సిబ్బందితో వెళితే ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. కానీ చంద్రబాబు మాత్రం తగ్గరు. కావాలంటే ఇంకా నాలుగు రాళ్లు ఖర్చు చేసైనా సరే కానీ బిల్డప్ మాత్రం భారీగా ఉండాలి అని కోరుకుంటారు. ఇక బాబు గారి దుబారా గురించి దేశం మొత్తం తెలుసు. బాబు దుబారా అని ఎవరు మొత్తుకున్నా కానీ ఐ డోంట్ కేర్ అంటారు ఆయన.

Also Read:  పాపం.. చంద్రబాబుకు ఎంత కష్టం

అంతా నా ఇష్టం .. అంతా నా ఇష్టం అని ఓ తెలుగు పాటలోని లిరిక్ లాగా చంద్రబాబు నాయుడు ఏపి సొమ్మును తన పాకెట్ మనీలాగా ఖర్చు చేస్తారు. మంచం ఎంతుంటే కాళ్లు అంతే ఉంచాలి అని పెద్దలంటారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అవసరమైతే కొత్త మంచం కొనండి అనే టైపు. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పింఛన్లు, స్కాలర్ ఫిప్ లు ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు. కానీ వాటికి డబ్బులు మాత్రం లేవు. జేబులో రూపాయిలేకున్నా డాబు చూపింయడం ఒక్క చంద్రబాబు నాయుడకు మాత్రమే సాధ్యం.

గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు హైదరాబాద్ లోని మొత్తం ముష్టివాళ్లను హైదరాబాద్ నుండి దాటించారు. వాళ్లను తరలించడానికి ప్రత్యేకంగా వాహనాలను రెడీ చేసి మరీ తరలించారు. అమెరికా క్రెడిట్ కొట్టెయ్యడానికి చంద్రబాబు నాయుడు పడ్డ ఆరాటం ఆ:ధ్రులను నవ్వులపాటుచేసింది. అయినా బిల్డప్ వళ్ల వచ్చేదేముందో చంద్రబాబు నాయుడుకు మాత్రమే తెలుసు. మాటలు కోటలు దాటతాయి.. కానీ కాళ్లు మాత్రం గపడదాటవు అన్నట్లు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఎన్ని ఉన్నా .. వాటిలో అమలు చేసిన వాటిని వేళ్ల మీద లెక్కించవచ్చు.

Also Read:  చంద్రబాబు శాంతిపూజలు చేస్తే సెట్ అవుతుందా..?

చచ్చిన ఆవు పగిలిన కుండ నిండ పాలుస్తుందట.. నిజానికి పాలిచ్చే ఆవులేదు, కనీసం కుండ కూడా లేదు. కానీ  ఎత్తిచూపడానికి మాత్రం అన్నీ ఉన్నట్లు. అచ్చం ఇలానే రాజధాని నిర్మాణానికి భారీగా ప్లాన్ వేశారు చంద్రబాబు. అయితే దానికి సొమ్ములకు మాత్రం కరువు ఉంది. కాలే కడుపులకే తెలుస్తుంది కూడు విలువ అన్నట్లు కరువు అంటారు, కానీ ఖర్చు మాత్రం తగ్గించరు చంద్రబాబు నాయుడు. పట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన అజెండగా విదేశీ పర్యటనలు చేపడ్తున్నట్లు చెప్పుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు...తన వెంట మందీ మార్భలాన్ని తీసుకెళ్తున్నారు.మలేషియా, సింగపూర్, దావోస్, జపాన్...నిన్నటి వరకు చైనాలో  చంద్రబాబు టీం పర్యటించింది. ఈ వరుస విదేశీ టూర్లతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల సంగతేమో తెలీదుగానీ...ప్రభుత్వ ఖజానాకు పెను భారమే అవుతోంది. చైనాలో చంద్రబాబు వెంట 18 మందితో కూడిన మంత్రులు, అధికారుల బృందం పర్యటించింది. తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తున్న ప్రధాని మోదీ బృందం కంటే చంద్రబాబు టీంలోని సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. అలా విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఇక చంద్రబాబు తరచుగా అద్దె విమానాల్లో ఢిల్లీ టూర్లు చేపట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంశం.  

chandrababu-bildup03


జగ్గీ వాసుదేవ్ చేత యోగా శిక్షణ కోసం గురు దక్షిణగా ప్రభుత్వం భారీగానే చెల్లించుకుంది. స్టార్ హోటళ్లలో మూడు రోజుల శిక్షణ కోసం ఒక్కొక్కరికి వేలాది రూపాయలు చెల్లించారు. ఒక్కక్కరికి జత బట్టల కోసం మూడు వేలు.. ప్లేటు భోజనానికి పదిహేను వందలు.. ఒక్కో సబ్సు కోసం ఏకంగా మూడొందలు చెల్లించారంటే ఇది ఏ పాటి కాస్ట్లీ ఆఫైరో అర్థం చేసుకోవచ్చు. యోగా శిక్షణ పేరుతో జగ్గీ వాసుదేవ్ ఖతాలోకి దాదాపుగా రెండు కోట్ల రూపాయల ప్రజాధనం ఇప్పటికే చేరినట్లు సమాచారం. ఢాంబికం ప్రదర్శించడం తప్ప ఇలాంటి శిక్షణా తరగతులతో సామాన్య ప్రజలకు ఒరిగేది సూన్యమే. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెబుతూ కొత్త రాజధాని నిర్మాణం కోసం చందాలు అడుగుతున్న ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా?.

Also Read:  చంద్రబాబు నాయుడు తప్పులు ఇవే..

బాబు గారు మీ ఖర్చు ఎంత అంటే బడ్జెట్ ఎంత  ఉందో అంత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అడ్డుఅదుపు లేకుండా ఓ సిఎం ఇలా ప్రజాధనాన్ని ఖర్చు చెయ్యడం ఎంత మాత్రం భావ్యం కాదు. ఇది పద్దతి కాదు.. ఇది తప్పు అని తెలిపినా కానీ చంద్రబాబు నాయుడు మాత్రం చెయ్యడం మానరు. ఎందుకంటే ఒకసారి అలవాటు పడ్డవారు మానుకోవడం కష్టం కదా. అయినా చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నేతకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ఖర్చు చేస్తున్నారా..? అని మరని కొందరు అనుకుంటున్నారు. ఎంతైనా చంద్రబాబు గారు ప్రజల సొమ్ముతో భలే డాబుగా తిరుగుతున్నారు. దేనికైనా  రాసినెట్టి ఉండాలి.

By Abhianavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu bildup  chandrababu  ap  crisis  budget  timesnow  media  100cr  chandrababu tour  

Other Articles