KCR | Hydearbad | Muncipal workers | Salaries, Hike, Bund

Some workers approved and some workers against the govt decision about the muncipal workers

KCR, Hydearbad, Muncipal workers, Salaries, Hike, Bund, GHMC

Some workers approved and Some workers against the govt decision about the muncipal workers. Telanagana govt hike the salaries of the Muncipal workers who working in the Hyderabad but no hike to other muncipalities.

కార్మికుల్లో కొంత మందికి మోదం.. మిగిలి వారికి ఖేదం

Posted: 07/17/2015 08:25 AM IST
Some workers approved and some workers against the govt decision about the muncipal workers

గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో కాంట్రాక్టు కార్మికులు, డ్రైవర్ల జీతాలు 47.05 శాతం పెంచినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 24 వేల మందికి పైగా కార్మికులకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన జీతాలను జూలై నెలనుంచే వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జీతాలు పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును మెచ్చి, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 8వేల 500 వేతనం వస్తుండగా, కొత్త జీతంగా దాన్ని 12వేల 500 చేశారు. డ్రైవర్లకు ప్రస్తుతం 10వేల 200 జీతం వస్తుండగా, ఇక నుంచి వారు నెలకు 15వేలకు పొందుతారు. ప్రభుత్వం వారికి రూ.4,800 పెంచింది.

Also Read:  కేసీఆర్ కు కంపు కొట్టడం లేదా..? సమ్మెపై తేలదే..!
Also Read:  పోలీస్ లకే షాక్.. వాళ్లనే అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది

జీతాలు పెరిగిన ప్రతిసారీ కొందరు నాయకులుగా చెలామణి అయ్యేవారు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి ఎవరైనా అలా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కార్మికులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వరాదని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాటికి సమ్మె విరమించిన వారందరికీ ఈనెల నుంచే వేతనాల పెంపును అమలుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఉద్యోగులను వెంటనే తొలగించాలని బల్దియా కమిషనర్ సోమేష్‌కుమార్‌కు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ కార్మికులకు 44 శాతం వేతనాలు పెంచిన తాము మున్సిపల్ కార్మికులపై ఉన్న ప్రేమ, సానుభూతితో 47 శాతానికి పైగా వేతనాలు పెంచినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read:  హైదరాబాద్ లో కంపు కొట్టును.. ముక్కులు అదురును
Also Read:  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌.. ఓ మోనార్క్‌..!

గత పదిరోజులుగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విచ్చిన్నం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తుంటే, జిహెచ్‌ఎంసి కార్మికులకే పెంచుతున్నట్లు, అది కూడా గురువారం సాయంత్రం వరకు ప్రభుత్వ పిలుపు మేరకు విధుల్లో చేరిన వారికే వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. విధుల్లో చేరని వారికి వర్తింపజేయడానికి వీల్లేదని చెప్పడం సమ్మెను మరింత జఠిలం చేసేవిధంగా ఉంది. సమ్మె సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన కార్మికులను విధుల నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ రెచ్చగొట్టినట్లు నిర్ణయాలు తీసుకున్నారని వామపక్ష పార్టీలు, కార్మికసంఘాలు మండిపడ్డాయి

By Abhinavachary

 

Also Read: కేసీఆర్ తాట తీసిన మున్సిపల్ మహిళా వర్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Hydearbad  Muncipal workers  Salaries  Hike  Bund  GHMC  

Other Articles