ప్రపంచంలో రానురాను ఆర్థికపరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వున్న ధరలు స్థాయికి మించి గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కాలంలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక మందగమనం గురించి సంచలనాత్మకమైన వ్యాఖ్య చేసింది. ‘‘ప్రపంచం త్వరలో మరో ఆర్థిక మంద్యాన్ని ఎదుర్కోబోతోంది. ఈసారి ప్రభావం గతంలోకన్నా మరింతగా వుండవచ్చు’’ అని హెచ్చరికను జారీ చేసింది.
నిజమే.. గతంలో కూడా ఇటువంటి ఆర్థిక మందగమనం ఏర్పడింది. దీనివల్ల అప్పట్లో చాలా సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా... పెట్టుబడుల విషయంలో, భవిష్యత్ విషయంలో ఒక గుణపాఠం కూడా నేర్పించింది. రానున్న కాలాలు కూడా ఇంకా కష్టంగా మారనున్నాయి కాబట్టి మన కష్టార్జితాన్ని ఏవిధంగా మదుపు పెట్టుకోవాలి అనే విషయం కీలకంగా తయారయింది.
అలాగే మనం పెట్టే పెట్టుబడులలో, మ్యూచువల్ ఫండ్లలో, ఫిక్స్డ్ డిపాజిట్లలో వైవిధ్యంగా వుండేలా చూసుకుంటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి విషయాలను జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భవిష్యత్ లో వచ్చే కష్టాలను చాలా సులభంగా అధిగమించవచ్చు. అయితే అందులో పాటించాల్సిన నియమాలను మనం కొన్ని తెలుసుకోవాల్సి వుంది.
ప్రస్తుతకాలంలో ధరలు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి.. మనం చేసే ఏ చిన్న పని అయినా క్రమం తప్పకుండా ఎంతోకొంత డబ్బును మదుపు చేసుకోవాలి. మన సంపాదన మరీ తక్కువయితే ఇలా చేయడం కొంచెం కష్టమే. అయితే అనవసరమైన ఖర్చులకు డబ్బులను తగలబెట్టకుండా.. సమయానుసారం డబ్బులను మదుపు చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేసుకుంటే.. తర్వాతి కాలంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. ఏదైనా ఒక పెట్టుబడి పెట్టినా.. అందులో కూడా క్రమంతప్పకుండా పొదుపు చేసుకోవాలి.
పెట్టుబడుల విషయంలో కొన్ని సూత్రాలను గ్రహిద్దాం.... సాధారణంగా కొంతమంది ఏదైనా ఒక మదుపు పథకంలో డబ్బు జమ చేశాక.. కొంతకాలానికే దానిని నిలిపివేయడం లేదా మదుపు చేసిన డబ్బును వెనక్కి తీసుకోవడం చేస్తారు. ఇలా చేస్తే భవిష్యత్ లో వచ్చే పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టం. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. మదుపు చేస్తున్న డబ్బులను కదిలించకుండా వుండాలి. పెట్టుబడుల నుంచి వచ్చే రాబడినే అవసరాలకు ఉపయోగించుకోవాలి. అవసరమైన రాబడిని కూడా తిరిగి పెట్టుబడులు పెట్టుకుంటే మరీ మంచిది. దీంతో మన డబ్బులు ఇంకా పెరగడానికి చాలా ఆస్కారముంటుంది.
సాధారణంగా కొన్ని కంపెనీలలో బోనస్ లు, జీతం పెంచడం లేదా ఇతర ప్రోత్సాహకాలు ఉద్యోగస్తులకు కల్పిస్తుంటారు. అలా వచ్చిన ఆ డబ్బులను నేరుగా ఖర్చులకు కాకుండా కొంత డబ్బును మదుపు చేసుకోవాలి. కాని కొందరైతే ఇలా డబ్బు అందిన ప్రతీసారి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. అదెలా అంటే.. ముందుగానే వున్న టీవీని ఎంతోకొంత డబ్బులకు ఇతరులకు అమ్మివేసి, ఎక్కువ ఖరీదైన వాటిని తెచ్చుకుంటారు. ఒక్క టీవీనే కాదు... ఇంకా ఇతరత్ర సామానులు తెచ్చుకుంటుంటారు. దీంతో వారి గృహాలంకరణ అయితే బాగానే వుండొచ్చు కానీ... భవిష్యత్ లో వచ్చే కష్టాలను అధిగమించడం చాలా ఘోరంగా వుంటుంది.
కొందరు తమ ఆర్థిక పరిస్థితి కంటే ఎక్కువ డబ్బులను పెట్టుబడులకు వెచ్చిస్తుంటారు. ఇలా చేయడం మంచిదే.. కానీ మొత్తం సొమ్మును ఒకేదానిలో పెట్టేయకూడదు. వైవిధ్యమైన పెట్టుబడులు పెట్టడం వల్ల.. ఒకదానిలో వచ్చే నష్టాన్ని మరొకదానితో పూరించవచ్చు. అప్పుడు మనం ఎటువంటి కష్టాలు వచ్చినా.. సులభంగా వాటిని అధిగమించగలం.
కొంతమంది ఏదైనా ఒక వస్తువు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుందన్న నెపంతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న ఆర్థికమాంద్య పరిస్థితుల్లో ఇటువంటి తప్పులు (అప్పులు) చేయకూడదు. కాలంమారుతున్న కొద్దీ వస్తువు విలువ కూడా మారుతుంటుంది. దాని విలువ పెరగవచ్చు లేదా తరగవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే.. వున్న డబ్బుతోనే పెట్టుబడులు పెట్టుకోవాలే తప్ప అప్పులు చేయకూడదు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more