ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి కేవలం ఆ డిస్కౌంట్ బ్యాలెట్లు మాత్రమే కనిపిస్తాయే తప్ప... క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు ఎంత డ్రా చేశాము..? ఎంత ఖర్చు చేశాం..? అందులో ముఖ్యమైనవి వున్నాయా..? లేవా..? అన్న అంశాల గురించి అస్సలు ఆలోచించుకోరు.
‘‘క్రెడిట్ కార్డు తీశామా, గీశామా, కొనుగోలు చేశామా’’ అని ప్రతిఒక్కరికి అదొక అలవాటుగా మారిపోయింది. కానీ దీనిని ఒక అలవాటుగా కాకుండా.. ఒక వ్యసనంగా పోల్చుకుంటేనే మంచిది. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు అంటే అప్పు.. అప్పు తీసుకున్నాక దానికి రుణాలు కూడా కట్టాల్సిందే! ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత ఎక్కువ రుణం... అలాగే ఎంత ఎక్కువ కార్డు ఉపయోగిస్తే.. అంత ఎక్కువ రుణం మీ అకౌంట్ లో జమా అయిపోతుందన్నమాట!
క్రెడిట్ కార్డు ఉపయోగం కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే పనికొస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బు అందుబాటులో లేకున్నప్పుడు క్రెడిట్ కార్డు తనదైన ముఖ్యపాత్రను పోషించి, మన గౌరవాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా పండుగ సీజన్ లలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక డ్రెస్సుగానీ, ఇతర సామాగ్రీలు గానీ కొనాలని షాపింగ్ మాల్ కి వెళ్లినప్పుడు.. అక్కడ అవసరానికి తగ్గట్టు తక్కువ ధరలో వున్నవాటిని మాత్రమే కొనుగోలు చేసి, క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవాలి.
అలా కాకుండా చేతికి ఏదో లడ్డూ దొరికినట్టు దొరికింది కదా అని అవసరమైనవి కాకుండా ఇతర వస్తువులు తీసుకుంటే... క్రెడిట్ కార్ట్ స్ర్కాచ్ చేసినట్లే.. బ్యాంకువాళ్లు కూడా మీ ఖాతాలో రుణాలను జమచేసి మీకు గుండు గీసేస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి..? ఎంత వరకు ఖర్చు చేసుకోవాలి..? అసలు దాని ఉపయోగమేంటి..? అవసరమైన వస్తువులేవి..? అన్న విషయాలపై ఒక అవగాహనకు వచ్చిన తరువాతే క్రెడిట్ కార్డును ఉపయోగించి, ఖర్చులు చేసుకోవాలి. అప్పుడే మీరు మీ ఖాతాలో వున్న డబ్బును కాపాడుకోగలరు.
క్రెడిట్ కార్డును ఉపయోగించుకునేముందు అవగాహన చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు :
1. క్రెడిట్ కార్డు వాడకం అనేది వారివారి జీవనశైలి మీద ఆధారపడి వుంటుంది. అంటే ముందుగా మనకు క్రెడిట్ అవసరం వుంటుందా..? లేదా..? అన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. సాధారణంగా ఎక్కువ వేతనాలు వున్నవారు తమ డబ్బులను బ్యాంకుల్లోనే జమ చేసి పెట్టుకుంటారు. ఇటువంటివారు తమ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడుపడితే అప్పుడు ఖర్చు చేస్తుంటారు. ఖర్చులకు తగ్గట్టుగా వేతనాలు కూడా వుంటాయి కాబట్టి.. క్రెడిట్ ఉపయోగించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఖర్చులను మాత్రం సాధ్యమైనంతవరకు అదుపులో వుంచుకునేందుకు ప్రయత్నించాలి. అదే తక్కువ వేతనాలు వున్నవారికి నిత్యావసరాలు తప్ప.. మిగతా ఖర్చులు వుండవు కాబట్టి... ఇటువంటివారికి క్రెడిట్ కార్డు అవసరం వుండదు.
2. క్రెడిట్ కార్డు వున్నవాళ్లు ముందుగానే ఏం ఖర్చు చేయాలి..? ఎంతవరకు ఖర్చు చేయాలి..? అవసరమైన వస్తువులు ఏవి..? అన్న వాటి గురించి ఒక లిస్ట్ ను ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం ఖర్చు ఎంతవరకు వస్తుంది అన్న అవగాహన ముందుగానే వేసుకోవాలి. అప్పుడు మీరు షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు అనవసర ఖర్చులు తగ్గుతాయి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, చెల్లింపులు చేసుకుంటే.. అధిక రుణభారం నుంచి సులువుగా తప్పించుకోవచ్చు.
3. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే క్రెడిట్ కార్డు ఉపయోగం కొన్ని సందర్భాలలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. మన దగ్గర డబ్బులు అందుబాటులో లేకున్నప్పుడు కేవలం అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అయితే ఇతర విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డు ఉపయోగం అంత మంచిది కాదు. ఇతర ఆస్తులను (ఇళ్లు, భూమి) కొనుగోలు చేయడంలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. మనకు మంచి లాభాలే అందుతాయి.
4. క్రెడిట్ కార్డును ఉపయోగించుకునే ముందు.. మీరు మీ జీతాన్ని లెక్కవేసుకోవడం మంచిది. మీరు ఎంతవరకు జీతం సంపాదిస్తున్నారో.. అంతకంటే తక్కువగా ఖర్చు చేయాలనుకునే ప్రణాళికతోనే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మంచిది. దీంతో మీరు బ్యాంకు రుణాల నుంచి కూడా గట్టెక్కుతారు. అలా కాకుండా క్రెడిట్ కార్డులు వినియోగిస్తే ఎక్కువగా పాయింట్లు, రివార్డులు వస్తాయని ఖర్చులు చేస్తే.. తరువాత మీకు రావాల్సిన జీతానికి బదులు, రుణాలను మోసుకోవాల్సి వస్తుంది.
క్రెడిట్ కార్డు ఉపయోగం కేవలం అత్యవసరాలకు మాత్రమేనన్న విషయాన్ని మనసులో పదిలం చేసుకొని ఉపయోగించండి. అప్పుడు మీరు మీ బడ్జెట్ ను అదుపులో పెట్టుకోగలుగుతారు. లేకపోతే.. బజారులో కూర్చొని పట్టపగలే చుక్కలను ఎంచుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. జాగ్రత్త!
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more
Mar 22 | ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు.... Read more