మార్కెట్లలో ఏవిధంగా అయితే వేలంపాటలు పాడి ధరలను విక్రయిస్తున్నారో... అదేవిధంగా ప్రస్తుతకాలంలో పిల్లల చదువులకు కావాల్సిన ఖర్చులు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి. నేటి ఫాస్ట్ జనరేషన్ లో విద్యార్థులలో ఒకరికొకరి మధ్య పోటీ నెలకొనడంతో చదువుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక ఉన్నత చదువుల గురించి అయితే చెప్పనవసరం లేదు.
ఉన్నత చదువులను చదవడం కోసం కొందరు లక్షల్లో డబ్బులను కేటాయిస్తుండగా.. మరికొందరు ఏకంగా ఇతర దేశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ ఖర్చులన్నింటిని భరించేందుకు తగినంత ఆర్థిక సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సి వుంటుంది. పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలను పూర్తిచేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకోసం, భవిష్యత్ కోసం ముందుగానే పెట్టుబడులు పెట్టి, తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. లేదా తమ కష్టార్జితం నుండి మిగిలిన డబ్బులను అనవసర ఖర్చులు చేయకుండా మదుపు చేసుకుంటున్నారు.
కానీ మరికొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక కారణాల వల్లగానీ, ప్రస్తుతం మార్కెట్ లో వున్న పరిణామాలవల్ల తమ పిల్లల విద్యకు కావల్సిన డబ్బులను కేటాయించలేకపోతున్నారు. అటువంటివారికి నిపుణులు కొన్ని సూచనలను సూచిస్తున్నారు.
అవేమిటంటే..
చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులకు కావాల్సిన ఖర్చుల గురించి అంతగా అవగాహన వుండదు. మొత్తం 15 సంవత్సరాలవరకు చదవాల్సిన చదువుల ఖర్చులను లెక్కలు వేయలేకపోతున్నారు. అటువంటి సమయాల్లో ప్రస్తుతం వున్న పథకాలను అమలు చేయడం మంచిదంటున్నారు. పిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఎన్నోరకాలు పెట్టుబడి పథకాలు అమలులోకి వున్నాయి. వీటిలో ఏదైనా ఒక పథకాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా పిల్లల చదువులకు కావల్సిన ఖర్చులను ఎదుర్కోవచ్చు.
ప్రస్తుతం పోటీవాతావరణం కాబట్టి కేవలం పాఠశాలలు, కాలేజీల చదువులు చదవడం సరిపోదు. ప్రత్యేకంగా నడపబడుతున్న ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లకు కూడా పంపించాల్సి వుంటుంది. కాబట్టి ఇటువంటి సమయాల్లో ముందు జాగ్రత్త వహించి, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీటికోసం అదనపు వ్యయం గురించి ఆలోచించాల్సి వుంటుంది.
మనం ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేముందు వాటి అవగాహన చేసుకోవడం చాలా మంచిది. అందులో వుండే మంచిచెడుల గురించి తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ లలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టాల్సి వుంటుంది. ఒకవేళ ఇంట్లో వున్న కుటుంబపెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఈ డబ్బును కేటాయించాల్సి వస్తుంది. అందువల్ల పిల్లల చదువుల కోసం ప్రత్యామ్నాయ బీమాపాలసీలను ఎంచుకోవడం ఇంకా మేలని చెబుతున్నారు నిపుణులు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more