భారత టెన్నిస్ చరిత్రలో మరో యువ కెరటం వచ్చి చేరింది. ఫెనెస్టా ఓపెన్ లో భాగంగా ఇక్కడ ఆర్కే ఖన్నా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఎన్ శ్రీరామ్ బాలాజీ సరికొత్త జాతీయ చాంపియన్ గా అవతరించాడు. టాప్ సీడ్ గా బరిలోకి దిగిన బాలాజీ తుది పోరులో సెకెండ్ సీడ్ విష్ణు వర్ధన్ ను బోల్తా కొట్టించాడు. హోరాహోరీగా సాగిన పోరులో బాలాజీ 7-5, 6-3 తేడాతో విష్ణు వర్ధన్ పై గెలిచాడు. దీంతో 2016 లో జరిగే ఢిల్లీ ఓపెన్ లో బాలాజీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది.
గత ఆరు సంవత్సరాల నుంచి జాతీయస్థాయిలో ఆడుతున్న బాలాజీ చాంపియన్ గా నిలవాలన్న కలను ఎట్టకేలకు సాకారం చేసుకున్నాడు. ఇప్పటికే తన సహచరుడు వీఎమ్ రంజిత్ తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ ను సాధించిన బాలాజీ.. సింగిల్స్ లో కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా మహిళల సింగిల్స్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ పెర్నా బాంబ్రీ నిలబెట్టుకుంది. తుది సమరంలో సమితా సాయి చమర్తిని కంగుతినిపించి టైటిల్ ను కాపాడుకుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more