20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్ సాగివుంటే భారత యువ షెట్లర్ చరిత్ర సృష్టించేవాడు. గడచిన 25 సంవత్సరాల వ్యవధిలో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు తొలిసారిగా అర్హత సాధించిన భారత యువకెరటం సుమిత్ నాగల్, తొలి రౌండ్ పోటీల్లో వరల్డ్ స్టార్ రోజర్ ఫెదరర్ కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి సెట్ ను 4-6 తేడాతో సునాయాసంగా గెలిచి, ఫెదరర్ కు షాకిస్థాడా? అన్నట్టు కనిపించాడు.
కాగా, ఫెదరర్ అనుభవం ముందు సుమిత్ తలవంచక తప్పలేదు. సుమిత్ షాక్ నుంచి తేరుకున్న ఫెదరర్ వరుస సెట్లలో 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్ ను ఓడించి, రెండో రౌండ్ లో అడుగు పెట్టి, ఊపిరి పీల్చుకున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో గత 20 ఏళ్లలో ఓ సెట్ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా సుమిత్ నిలిచాడు. ఓడిపోయినప్పటికీ... ఫెదరర్ వంటి దగ్గజానికి చెమటలు పట్టించాడని అతనిని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
కాగా, 2015లో వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న నాగల్, బ్రెజిల్ కు చెందిన జావో మెనేజస్ ను 5-7, 6-4, 6-3 తేడాతో క్వాలిఫయర్ పోటీలో ఓడించి, యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం యూఎస్ ఓపెన్ తో నాగల్ తో పాటు ప్రజనేశ్ గుణేశ్వరన్ కూడా ఆడుతున్నాడు.
4-6, 6-1, 6-2, 6-4@rogerfederer gets his 40th win of the year after rallying to defeat spirited qualifier Sumit Nagal!#USOpen pic.twitter.com/3LBjNp0hrn
— US Open Tennis (@usopen) August 27, 2019
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more
Jan 05 | బ్రిటన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్ వన్, 3సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more