Serena Williams fined $17000 at US Open సెరెనా విలియమ్స్ కు పెరుగుతున్న మద్దతు..

Serena williams backed over umpire sexism claim after 17k fine

serena williams, serena williams fine, serena williams fine us open, serena williams fine career, Naomi Osaka, us open 2018, us open final, chair umpire, Carlos Ramosus, sports news, sports, latest sports news

Serena Williams has been fined a total of $17,000 for her three code violations during the US Open final against Naomi Osaka.

సెరెనా విలియమ్స్ కు పెరుగుతున్న మద్దతు..

Posted: 09/10/2018 06:57 PM IST
Serena williams backed over umpire sexism claim after 17k fine

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన అరోపణలకు బలం పెరుగుతుంది. వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ తో పాటు యూనైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ కూడా సెరెనా విలియమ్స్ కు అండగా నిలుస్తుంది. అమె తన కోచ్ ను సంప్రదించడంలో, అమె భావాలను వ్యక్తపర్చడంలో తప్పేమీ లేదని ఆయా సంఘాలు పేర్కొన్నాయి.

ఈ విషయంలో పురుషులకు ఒకలా, మహిళలకు మరోలా నిబంధలను ఎలా పెడతారని ఆయా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆటలో అందరికీ సమానంగా నిబంధనలు వుండాలే తప్ప.. ఒకరికి ఒకలా మరోకరికి మరోలా నిబంధనలను పెట్టరాదని అభిప్రాయపడ్డాయి. సెరెనాకు జరిమానా విధించడం విషయాన్ని పక్కనబెడితే.. అమె కోచ్ ను సంప్రదించిందన్ని విషయంతో పాటు తన రాకెట్ ను నెలకేసి కోట్టి విరిచేసిందన్న అభియోగాలను మోపి అమెపై చర్యలు తీసుకోవడం సముచితం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

అయితే అంఫైర్ కార్లోస్ రామోస్ అమె పట్ల చేసిన దూషణలన్నీ లైంగిక దూషణలుగా పరిగణించాలన్న సెరెనా విలయమ్స్ డిమాండ్ కు మద్దతు పెరుగుతుంది. సెరెనాకు ఆ రెండు సంఘాలతో పాటు మరికోందరు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అయితే అంఫైర్ కార్లోస్ చర్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా సెరినా అంఫైర్ తో  దుర్బాషలాడినందుకు 10 వేల డాలర్లు, కోచ్ ను సంప్రదించినందుకు 4 వేల డాలర్లు, రాకెట్ ను విసిరికొట్టినందుకు 3 వేల డాలర్ల చొప్పున మొత్తం 17 వేల డాలర్ల (రూ.12 లక్షలు) జరిమానా విధించింది.  

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో జపాన్ యువ క్రీడాకారిణి నవోమీ ఒసాకా చేతిలో  6-2, 6-4 తేడాతో సెరెనా ఓటమి పాలైంది. 24వ మేజర్ టైటిల్ పై కన్నేసిన సెరెనా ఓటమిని జీర్ణించుకోలేక పోయింది. తొలి సెట్ తర్వాత కోచ్ ను సంప్రదించినందుకు చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో సెరెనా రెచ్చిపోయింది. "నువ్వో అబద్ధాల కోరువి. దొంగవి. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే" అంటూ రంకెలేసింది. అంతకుముందు తన రాకెట్ ను బలంగా నేలకేసి కొట్టి విరిచింది. దీంతో ఎంత పేరు, ఎంత ప్రతిష్ట వున్నవారు అంత శాంతంగా, సహనంగా వుండాలని చెప్పడంతో పాటు తన కోపమే తన శత్రువు అని కూడా మరోమారు చాటిచెప్పినట్లు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : serena williams  fine  us open  chair umpire  Carlos Ramosus  Naomi Osaka  open final  sports news  

Other Articles

  • Five time grand slam winner maria sharapova announces retirement

    టెన్నిస్ కు మారియా షరపోవా గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ భావోద్వేగం..

    Feb 26 | రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్‌ ప్లేయర్‌.. ఇవాళ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more

  • India s sumit nagal puts up a good fight against roger federer

    ఫెదరర్ కు చమటలు పట్టించిన నాగల్.. తొలిసెట్ విజయం

    Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more

  • Icc and wimbledon banter on twitter after roger federer plays cricket stroke

    టెన్నిస్ స్టార్ కు ఐసిసి ఫస్ట్ ర్యాంకు

    Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more

  • Sania mirza shuts down twitter troll for calling her non indian

    నెట్ జనుడికి సానియా మైండ్ బ్లాక్ జవాబు..

    Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more

  • Doubts turn to desperation after andy murray s lost six months

    అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

    Jan 05 | బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, 3సార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more