Roger Federer becomes ICC's 'no. 1 Test batsman' టెన్నిస్ స్టార్ కు ఐసిసి ఫస్ట్ ర్యాంకు

Icc and wimbledon banter on twitter after roger federer plays cricket stroke

Social, Federer, UK, ICC, Roger Federer, Tennis, Wimbledon, composite, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Roger Federer’s not bad at tennis, but it looks like he knows his cricket shots too – and even cricket’s global governing body agrees.

టెన్నిస్ స్టార్ కు ఐసిసి ఫస్ట్ ర్యాంకు

Posted: 07/10/2018 05:20 PM IST
Icc and wimbledon banter on twitter after roger federer plays cricket stroke

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో నెం.1 ర్యాంకును ఇచ్చింది. అదేంటి టెన్నీస్ స్టార్ కు టెస్టు ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానమని అలోచనలో వడ్డారా.? స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కొట్టిన ఓ షాట్ టెన్నిస్ ఆటలో క్రికెట్ షాట్ ను తలపించేలా వుండటంతో.. ఈ ర్యాంకు లభించింది.

వివరాల్లోకి వెళ్తే.. వింబుల్డన్ 2018లో భాగంగా పురుషుల సింగిల్స్ విభాగంలో ఫ్రెంచ్ ఆటగాడు మన్నారినోతో జరిగిన ఓ మ్యాచ్లో ఫెదరర్ ఓ షాట్ ని క్రికెట్ లోని ఫార్వడ్ డిఫెన్స్‌ షాట్ మాదిరిగా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోని వింబుల్డన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘రోజర్ ఫెదరర్ ఫార్వడ్ డిఫెన్స్‌కి రేటింగ్ ఏంటీ’’ అంటూ ఐసీసీని ట్యాగ్ చేసింది. దీనిపై ఐసీసీ వెంటనే స్పందించిన రీట్వీట్ చేసింది
 
‘‘అసలు ఈ వ్యక్తి చేయలేనిది ఏదైనా ఉందా.. అలాగే ఇతను నెట్స్‌లో స్టువర్ట్ బోర్డుని ఎలా ఎదురుకుంటాడో చూడాలని ఉంది’’ అని ఫెదరర్ ప్రతిభను మెచ్చుకుంది. దీంతో పాటు రోజర్ ఫెదరర్‌కి టెస్టుల్లో నెం.1 ర్యాంకును ఇస్తూ.. మరో పోస్ట్ చేసింది. అంతేకాక ‘‘ఎప్పుడు ఓ గొప్పతనం మరో గొప్పతనాన్ని కలుస్తుందో’’ అంటూ ఇద్దరు స్పైడర్ మ్యాన్ల వేషంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్, ఫెదరర్‌లు ఉన్న ఫోటోని కూడా ఐసీసీ కామెంట్ చేసింది. దీంతో కొంత సమయంలోనే ఈ ట్వీట్లు వైరల్‌ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Social media  UK  ICC  Roger Federer  Tennis  Wimbledon  composite  cricket  

Other Articles