Sania Mirza and Martina Hingis enter China Open doubles final

Sania mirza martina hingis enter china open final

Martina Hingis,Sania Mirza,Tennis Sania Mirza-Martina Hingis Enter China Open Semis, Sania Mirza,Martina Hingis, German-Czech pair, Julia Goerges Karolina Pliskova latest Tennis news

The leading women's tennis doubles pair of Sania Mirza and Martina Hingis marched into the final of the China Open

చైనా ఓపెన్ టైటిల్ కు అడుగు దూరంలో సానియా-హింగీస్ జోడీ

Posted: 10/09/2015 07:05 PM IST
Sania mirza martina hingis enter china open final

భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో కలిసి చైనా ఓపెన్ డబ్యూటీఏ టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన సైనా.. టైటిల్ అందుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడీ 6-2, 6-3 తేడాతో చెన్ లియాంగ్-యఫాన్ వాంగ్(చైనా) జోడీపై గెలిచి ఫైనల్ కు చేరింది. వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జోడి మరో టైటిల్ వేటకు సిద్ధమైంది.

ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ ఎనమిదవ టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా కోల్పోకుండా అత్యత్తమ మెరుగైన ప్రదర్శనతో రాణిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Julia Goerges  China Open  

Other Articles