మధుమేహం వ్యాధితో బాధపడేవారికి ఇంకా మరెన్నో ఇబ్బందులు తప్పవు. ఆ వ్యాధిగ్రస్తులు ఎన్నో జాగ్రత్తలు పాటించడంతోపాటు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారాన్నే సేవించాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. అంతేకాదు.. వ్యాయామం కూడా ఎంతో అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు పోషకాలు నిండిన డైట్‌ను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహానికి ఆకలి, నోరు ఎండిపోవడం, అలసట, చేతులు, కాళ్ల నొప్పులు వంటివి లక్షణాలు. ఇంకా కంటిచూపు మందగించడం, శరీర బరువు పెరగడం, తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కోపం, మానసిక ఒత్తిడి, చిన్న గాయాలు కూడా మానిపోకుండా చాలారోజులకు అలానే ఉండిపోతాయి.
అయితే సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహగ్రస్థులు అరటిపూవు, అరటికాడ, క్యాబేజీ, లేత వంకాయలు, బెండ కాయలు, మునగాకు, పొట్లకాయ, దొండకాయ, లేత బీరకాయలు, లేత చిక్కుడు కాయల్ని తీసుకోవచ్చు. అలాగే ఆకుకూరల్లో పొన్నగంటి, తోటకూర, మెంతికూర, కొత్తిమీర వంటివి తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకో ఆకుకూర తీసుకోవాలి. ఆకుకూరల్ని కూరగానో లేదా సూప్‌లా తీసుకోవచ్చు. ఆకుకూరల తరుగుతోపాటు కాస్త మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లి, కాసింత పసుపు చేర్చి రెండు గ్లాసుల నీటిలో మరిగించి సూప్‌లా తీసుకోవడం మంతో మేలు చేస్తుంది.
అయితే.. మధుమేహం వ్యాధితో బాధపడేవారు చక్కెర, గ్లూకోజ్, స్వీట్స్, కేక్, చాక్లెట్, ఐస్ క్రీమ్, బెల్లం, బంగాళాదుంప, మామిడి, అరటి పండు, సపోటా, కూల్ డ్రింక్స్ వంటివి ఎప్పటికీ తీసుకోకూడదు. క్యారట్, బీట్ రూట్ నెలకోసారి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు. మధుమేహ లక్షణాలుంటేనే వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఈ విధంగా నిపుణులు ఇచ్చిన ఆరోగ్య సలహాలు తూ.చ. తప్పకుండా పాటిస్తే.. ఆ వ్యాధిని చెక్ పెట్టవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more