Tips for good and deep sleep at nights

health tips, deep sleep tips, good sleep tips, healthy tips, healthy food for sleep, sleeping tips, health tips for sleep

tips for good and deep sleep at nights : Here are some natural tips are available which helps for good and deep sleep.

సుఖంగా నిద్రపోవడానికి హెల్తీ టిప్స్..

Posted: 03/06/2015 05:45 PM IST
Tips for good and deep sleep at nights

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ప్రతిఒక్కరు అటు ఇంటితోపాటు ఆఫీసు కార్యక్రమాలను నిర్వర్తించుకోవడంలో బిజీగా వుండటం వల్ల ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. అంతెందుకు.. కనీసం తమ ఇంటివాళ్లతో కలిసి సంతోషంగా కాలం గడపలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈరోజుల్లో విశ్రాంతికి సమయం కరువైంది. కొందరు నిద్రలేక బాధపడుతుంటే.. మరికొందరు నిద్రపోవటానికి సమయం లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వీటికితోడు సామాజిక వెబ్ సైట్లు కూడా నిద్రకు ఆటంకంగా మారుతున్నాయి. చాలామంది ఫేస్ బుక్, ట్విట్టర్లలో కాలం గడిపేస్తున్నారు. ఇలాగే సాగితే.. త్వరలోనే అనారోగ్య బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి.. నిద్ర ఎంతో ముఖ్యం. కనీసం 8 గంటలవరకు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు గాఢమైన నిద్రలో జారుకోవాలంటే అందుకు కొన్ని అనువైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటో తెలుసుకుందామా....

* ప్రతిఒక్కరు నిద్రపోయేందుకు ఫిక్స్ డ్ టైం పెట్టుకోవాలి. ఎన్ని కార్యక్రమాలు, పనులు వున్నప్పటికీ.. టైమ్‌కి నిద్రపోయి ఉదయం త్వరగా మేల్కుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

* ఆహారం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం సరికాదు. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల విరామం వుండేలా చూసుకోవాలి.

* రాత్రివేళ పడుకోవడానికి ముందు స్నానం చేస్తే మరీ మంచిది. ఉదయం నుంచి అలసిపోయి వుంటారు కాబట్టి.. స్నానం చేస్తే మెదడు ఫ్రెష్ అవుతుంది. అప్పుడు అనుకోకుండా నిద్రలోకి జారిపోతారు.

* సాయంత్రం వేళల్లో కాసింత ఒళ్ళు వంచగలిగితే శరీరం అలసినట్టవుతుంది. అంటే.. వ్యాయామం చేయడం అన్నమాట! వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది. నిద్ర చక్కగా వస్తుంది.

* రాత్రివేళల్లో లైటు ఉంటేనే కొందరు నిద్రపోతారు. అలాంటి వారు రూల్సు బ్రేక్ చేయాలి. లైట్లు ఆర్పేసి పడుకోవడం అలవాటు చేసుకోగలితే సుఖ నిద్ర సొంతం చేసుకుంటారు.

* బెడ్‌పై స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్లు వంటి వాటికి స్థానం కల్పించకూడదు. నిద్రవేళ సంగీతం వినడం కూడా మంచి అలవాటు కాదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి.

* కాఫీకి దూరంగా ఉండాలి. అందులో ఉండే కెఫీన్ నిద్ర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sleeping tips  good sleep tips  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more