Mary Kom secures eighth world medal సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న మేరీకోమ్

With 8th world medal mary kom surpasses herself as the most successful boxer

mary kom, mc mary kom, boxing, world womens boxing championship, boxing championship, womens boxing, world boxing, world championship, boxing news, sports news, boxing, sports

In a potentially big blow to India, Jasprit Bumrah has been ruled out of the home Test series against South Africa with a minor stress fracture in his lower back. Umesh Yadav has been called in as his replacement.

సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న మేరీకోమ్

Posted: 10/10/2019 12:37 PM IST
With 8th world medal mary kom surpasses herself as the most successful boxer

భారత దిగ్గజ బాక్సర్ మేరికామ్ తన సాటిలేని మేటి ప్రతిభతో మరో ఘనతను సాధించింది. రష్యాలోని ఉలన్ ఉదె వేదికగా జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సెమీ పైనల్స్ కు చేరిన మేరీకోమ్ వరల్డ్ ఛాంపియన్ షిఫ్ లో అత్యధిక పతకాలు సాధించిన బాక్సర్ గా సరికొత్త రికార్డును తన ఖాతాలోకి వేసుకుంది. ఈ పోటీలలో నువ్వా-నేనా అన్నట్లు సాగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ లో తన అద్భుత ప్రదర్శనతో ఏకపక్ష విజయంగా మార్చేసింది.

ఇవాళ జరిగిన 51 కేజీల విభాగంలో కొలంబియాకి చెందిన బాక్సర్ ఇంగ్రీట్‌ని 5-0 తేడాతో చిత్తుగా ఓడించేసి అద్బుత విజయాన్ని అందుకుంది. దీంతో మేరీకోమ్‌కి కనీసం కాంస్య పతకం ఖాయమవగా.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు సాధించిన బాక్సర్‌గా మేరీకోమ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గత ఏడాది క్యూబాకి చెందిన బాక్సర్‌ పెలిక్స్ ఏడు పతకాల రికార్డ్‌ని సమం చేసిన మేరీకోమ్.. ఈరోజు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడం ద్వారా 8 పతకాలతో రికార్డ్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

ఇటీవల 48 కేజీల విభాగం నుంచి 51 కిలోల కేటగిరీకి మారిన మేరీకోమ్.. న్యూఢిల్లీ వేదికగా గత ఏడాది జరిగిన ఛాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో పోటీపడి బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. మొత్తంగా.. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికే 6 స్వర్ణం, ఒక రజత పతకం గెలుపొందిన మేరీకోమ్.. తాజాగా కనీసం కాంస్యంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్‌లో 8 పతకాల్ని సాధించిన తొలి బాక్సర్‌గా రికార్డ్‌ నెలకొల్పింది.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం లేకపోవడంతో.. తాజాగా 51 కిలోల కేటగిరీకి మారిన మేరీకోమ్.. ఫస్ట్ టోర్నీలోనే అదరగొట్టింది. టోర్నీలో భాగంగా సెమీస్‌లో ఇక మేరీకోమ్ శనివారం టర్కీకి చెందిన బుసెంజాతో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కి వెళ్తే బంగారం లేదా రజతం గెలిచే అవకాశాలుంటాయి. ఒకవేళ సెమీస్‌లో ఓడినా.. మేరీకోమ్‌కి కాంస్యం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles