Setback to PV Sindhu as coach kim ji hyun quits పీవీ సింధు బ్యాట్మింటన్ కోచ్ రాజీనామా.!

Setback to pv sindhu as coach kim ji hyun quits

PV Sindhu coach, Kim Ji Hyun, PV Sindhu, Badminton Association of India, Pullela Gopichand, PV Sindhu coaching staff, PV Sindhu South Korean coach, Badminton news, Sports news, latest news, sports, latest Badminton news, cricket

With less than a year to go for the Tokyo Olympics, South Korea's Kim Ji Hyun has stepped down from her position as India's women's singles badminton coach to attend to her ailing husband in New Zealand.

పీవీ సింధు బ్యాట్మింటన్ కోచ్ కిమ్ జి హూన్ రాజీనామా.!

Posted: 09/24/2019 07:35 PM IST
Setback to pv sindhu as coach kim ji hyun quits

భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకి టోక్యో ఒలింపిక్స్ ముంగిట ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సహాయ కోచ్ కిమ్ జి హూన్ వ్యక్తిగత కారణాలతో తాజాగా రాజీనామా చేసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌‌కి ఇక 11 నెలల వ్యవధి మాత్రమే ఉండగా.. ఈ సమయంలో కిమ్ ఇలా రాజీనామా చేయడం పీవీ సింధూ ఆటపై ప్రభావం చూపే అంశమే.

దక్షిణ కొరియాకి చెందిన 45 ఏళ్ల కిమ్‌కి కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. 1989లో బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్ గెలిచిన కిమ్.. ఆ తర్వాత 1994 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుపొందింది. 1996, 2000 ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటిన కిమ్ 2001లో రిటైర్మెంట్ ప్రకటించి.. ఆ తర్వాత కోచ్‌గా క్రీడాకారుల్ని తీర్చిదిద్దుతోంది. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌షిప్‌ కోసం పీవీ సింధూ‌తో పాటు భారత షట్లరని సిద్ధం చేసే క్రమంలో గత కొన్ని నెలలుగా కిమ్ భారత్‌లో ఉండిపోయింది.

 అయితే.. ఇటీవల ఆమె భర్తకి గుండెపోటురాగా.. తాజాగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. కిమ్ తన భర్త దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుని కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కిమ్ రాజీనామాతో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై అదనపు భారం పడనుంది. సింధూతో పాటు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ తదితరులకి శిక్షణ ఇస్తున్న గోపీచంద్‌కి ఇన్నిరోజులూ సహాయ కోచ్‌గా కిమ్ పనిచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Kim Ji Hyun  badminton coach  tokyo olympics  Badminton  sports  

Other Articles