Dual Olympic Bids Approved For Paris And Los Angeles ఒలంపిక్స్ అతిథ్య నగరాలపై అందోళన

Dual olympic bids approved for paris and los angeles

Chariots of Fire,Eric Liddell,International Olympic Committe,IOC,Los Angeles,Olympic Games,Olympics,Paris,Summer Olympics,throwback,Sporting Events, Sports Business, Sports Business news, latest sports news

We now have hosts for the next two Summer Olympics. Paris will host in 2024 and Los Angeles in 2028. As the result could be Olympic Games without the embarrassments of empty seats and foul water of Rio

ఒలంపిక్స్ అతిథ్య నగరాలపై అందోళన

Posted: 09/14/2017 07:17 PM IST
Dual olympic bids approved for paris and los angeles

2024, 2028 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే నగరాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించిన నేపథ్యంలో పలు దేశాల క్రీడాకారులలో అందోళన వ్యక్తం అవుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రభావం అధికంగా వున్న పారిస్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలు నిర్వహణ ఎందుకన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను స్వేచ్చగా చాటుకునే క్రమంలో ఉగ్రవాద భయం వారిని వెంటాడుతుందని అందోళన వ్యక్తం అవుతుంది.

ఇప్పటికే రెండు పర్యాయాలు ఐసిస్ ఉగ్రవాదులు పారిస్ నగరంపై విరుచుకుపడి మారణహోమం సృష్టించిన నేపథ్యంలో 2024లో పారిస్ లో అదే నగరాన్ని ఒలంపిక్స్ అతిథ్య నగరంగా ఎంపిక చేయడానికి గల కారణాలు ఏమిటన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. 2028లో లాస్ ఏంజెల్స్ లో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఒకేసారి రెండు ఒలింపిక్స్ కు ఆతిథ్య నగరాలను ఐఓసీ ప్రకటించడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. కాగా, పారిస్, లాస్ ఏంజెల్స్ కు గతంలో ఒలింపిక్స్ నిర్వహించిన అనుభవం ఉంది.

 పారిస్ లో 1900, 1924 ఒలింపిక్స్, లాస్ ఏంజెల్స్ లో 1932, 1984లో నిర్వహించారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే, వందేళ్ల తర్వాత మళ్లీ పారిస్ లో ఒలింపిక్స్  జరగనున్నాయి. ఇదిలా ఉండగా, 2024 ఒలింపిక్స్ కోసం పారిస్, లాస్ ఏంజెల్స్ తో పాటు మరో నాలుగు నగరాలు హాంబర్గ్, రోమ్, బుడాపెస్ట్, బోస్టన్ పోటీపడ్డాయి. రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల ఆ నాలుగు నగరాలు పోటీ నుంచి తప్పుకోగా, పారిస్, లాస్ ఏంజెల్స్ మాత్రమే మిగిలాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris  los angeles  International Olympic Committee  Sporting Events  Sports Business  sports  

Other Articles