PV Sindhu Enters Semi-final in Korea Open కొరియా ఓపెన్ సెమీస్ లోకి దూసుకెళ్లిన సింధూరం

Korea open pv sindhu enters semi final after thrilling win

pv sindhu, sameer Verma, Son Wan, Sung Ji Hyun, Minatsu Mitani, sindhu badminton, korea super series 2017, india badminton, badminton news, Badminton, sports news, latest badminton news, latest sports news

PV Sindhu continued her impressive run and advanced to the semi-final of the Korean Super Series 2017 by beating Minatsu Mitani of Japan 21-19 18-21 21-10 in quarter-final in Seoul.

కొరియా ఓపెన్ సెమీస్ లోకి దూసుకెళ్లిన సింధూరం

Posted: 09/15/2017 06:10 PM IST
Korea open pv sindhu enters semi final after thrilling win

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంటులో భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్‌ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో తన ప్రత్యర్థిపై విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ లోకి దూసుకెళ్లి మరో పతాకన్ని సాధించేందుకు రెండడుగుల దూరంలో నిలిచింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో టోర్నీలో ఐదో సీడ్ గా బరిలోకి దిగిన సింధూరం.. జపాన్‌ క్రీడాకారిణి మితాని మినత్సుతో తలపడింది.

తొలి గేమ్ నుంచే తన అధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యర్థి మితానితో తలపడిన సింధూ.. హోరాహోరిగా పోరాడి చివరకు రెండు పాయింట్ల తేడాతో పైచేయి సాధించింది. ఇక రెండో గేమ్ ను సింధూ కోల్పోయారు. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యం కాగా, ఈ గేమ్ లో ప్రత్యర్థి మితానీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా  సింధు చెలరేగిపోయింది. వరుస పాయింట్లతో దూసుకుపోయి జపాన్ క్రీడాకారిణిపై విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో సెమీస్ లోకి వెళ్లింది.

సుమారు 63 నిమిషాల పాటు సాగిన ఈ క్వార్టర్స్ లో సింధుతో ప్రత్యర్థి క్రీడాకారిణి మితాని సుదీర్ఘ ర్యాలీలు బ్యాడ్మింటన్ అభిమానులను అకట్టుకున్నాయి. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 22-20, 10-21, 13-21తో టాప్‌ సీడ్‌ సాన్‌వాన్‌(దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  Korea Open Super Series  Minatsu Mitani  PV Sindhu  Sameer Verma  Son Wan  Sung Ji Hyun  

Other Articles