Saina Nehwal Enters Finals of Australian Open, Kidambi Srikanth Knocked Out

Saina nehwal enters finals of australian open

Anthony Sinisuka Ginting, Australian Open Super Series, Jin Wei Goh, K Srikanth, Ratchanok Intanon, Saina Nehwal, Sameer Verma, Sony Dwi Kuncoro, SportsTracker, Tanvi Lad, Wang Yihan

Saina Nehwal defeated second seed Wang Yihan to enter the final of the Australian Open Badminton Championships while Kidambi Srikanth lost in the semi-final

అస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ లోకి సైనా నెహ్వాల్

Posted: 06/11/2016 05:01 PM IST
Saina nehwal enters finals of australian open

ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ లో స్టార్ షట్ల‌ర్‌ సైనా నెహ్వాల్ భార‌త అభిమానుల ఆశ‌ల్ని నిల‌బెట్టింది. నిన్న‌టి క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింగిల్స్ విభాగంలో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ పై గెలుపొంది సెమీ ఫైన‌ల్‌కి చేరిన సైనా నెహ్వాల్.. నేటి సెమీ ఫైన‌ల్లోనూ విజ‌యం సాధించింది. 21-8, 21-12 వ‌ర‌స సెట్ల‌ తేడాతో సెమీస్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్‌-2 షట్ల‌ర్ వాంగ్‌పై సైనా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. మ‌రోవైపు పురుషుల విభాగంలో సెమీ ఫైన‌ల్లో కిదాంబి శ్రీకాంత్‌ ఓట‌మి పాల‌యిన విష‌యం తెలిసిందే.

నిన్న జ‌రిగిన ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ క్వార్ట‌ర్స్‌లో అంచ‌నాల‌కు మించి రాణించి సింగిల్స్ విభాగంలో సెమీ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించిన ఇండియ‌న్ స్టార్ షట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్‌ ఈరోజు జ‌రిగిన సెమీ ఫైన‌ల్లో భార‌త‌ అభిమానుల‌కు నిరాశే మిగిల్చాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్ ష‌ట్ల‌ర్ హన్స్‌ క్రిస్టియన్ తో శ్రీ‌కాంత్ పోరాడి ఓడాడు. 22-20, 21-13 వరుస సెట్లతో ప‌రాజ‌యం పాల‌య్యాడు. ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ లో ఇక భార‌త అభిమానుల ఆశ‌లన్నీ ఇప్పుడు మ‌రో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ పైనే ఉన్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles