Long way to go, says Alastair Cook on matching up to ‘Genius’ Sachin Tendulkar

Saina nehwal k srikanth into australian open semis

Anthony Sinisuka Ginting, Australian Open Super Series, Jin Wei Goh, K Srikanth, Ratchanok Intanon, Saina Nehwal, Sameer Verma, Sony Dwi Kuncoro, SportsTracker, Tanvi Lad, Wang Yihan

Rio-bound Indian shuttlers Saina Nehwal and K Srikanth registered straight-game wins to reach the quarter-finals of the women's and men's singles events respectively

అస్ట్రేలియా ఓపెన్ సెమీస్ లోకి సైనా, శ్రీకాంత్

Posted: 06/10/2016 08:21 PM IST
Saina nehwal k srikanth into australian open semis

ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ ఇరువురూ తమ తమ సింగిల్స్ విభాగాల్లో విజయం సాధించి సెమీస్కు చేరారు. మహిళల సింగిల్స్ పోరులో సైనా 28-26, 21-16 తేడాతో రాచ్నొక్ పై విజయం సాధించి సెమీస్ చేరగా, పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ 21-18, 21-17 తేడాతో కొరియాకు చెందిన వాంగ్ హీ హోపై గెలిచి సెమీ ఫైనల్లోకి చేరాడు.

మహిళల సింగిల్స్ భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో  భాగంగా సైనా- రాచ్నాక్ల మధ్య  జరిగిన మొదటి గేమ్ హోరాహోరీగా సాగింది. అయితే కీలక సమయాల్లో రాచ్నాక్ పై పైచేయి సాధించిన సైనా  తొలి గేమ్ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్లో ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన సైనా ఆ గేమ్ను కూడా సొంతం చేసుకుని సెమీస్ కు చేరింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో  సైనా ఎటువంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వకుండా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. 36 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ అంచనాలకు మించి రాణించి సెమీస్కు చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles