Malaysia Open: Saina Nehwal handed third consecutive semifinal loss

Saina nehwal loses in malaysia open semi final

malaysia super series, malaysia super series news, malaysia super series schedule, saina nehwal, saina nehwal vs tai tzu ying, nehwal india, nehwal semi-final, sports news, sports, badminton news, badminton

Olympic bronze medallist Saina Nehwal, who has lost to the World No. 9 Tai Tzu seven times in 12 meetings once again failed to find a way against the Chinese.

సెమీస్ లో సైనాకు మూడో వరుస ఓటమి

Posted: 04/10/2016 11:54 AM IST
Saina nehwal loses in malaysia open semi final

సెమీస్ గండం మళ్లీ సైనా నెహ్వాల్ ను వెంటాడింది. వరుసగా మూడో పర్యాయం అమె సెమీ పైనల్ కు చేరుకున్నా.. అక్కడి నుంచి వెనుదిరగడం సాధారణంగా మారింది, తాజాగా మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా 19-21, 13-21 తేడాతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. తొలి  గేమ్ ఆదిలోనే  సైనా 0-7 తేడాతో వెనుకంజ వేసి అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.
 
ఇక ఆ తరువాత రెండో గేమ్లో పూర్తిగా డీలాపడ్డ  సైనా ప్రత్యర్థికి వరుస పాయింట్లను సమర్పించుకుని ఓటమి పాలైంది. దీంతో సైనా నెహ్వాల్ వరుసగా మూడో సెమీ ఫైనల్ ఓటమిని మూటగట్టుకుంది.  అంతకుముందు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి, ఇండియన్ సూపర్ సిరీస్లలో కూడా సైనా సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. కాగా, గతంలో ఈ టోర్నీలో మూడు సార్లు సెమీస్ తోనే సరిపెట్టుకున్న సైనా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయడం గమనార్హం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  Malaysia Open  semi-final  badminton  

Other Articles