Vijender Singh discusses state of Indian boxing with PM Narendra Modi

Feeling motivated having a discussion on future of boxing

vijender singh, vijender singh udates, vijender singh fights, narendra modi, vijender modi, sports news, sports, boxing news, boxing

The Indian boxing administration has been in a mess since 2012 when the federation was first suspended due to manipulation in elections.

ప్రధానితో భేటీ ప్రేరణను కల్పించింది..

Posted: 03/23/2016 07:02 PM IST
Feeling motivated having a discussion on future of boxing

ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న విజేందర్ సింగ్ ఇప్పటివరకు పోటీపడిన నాలుగు బౌట్‌లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేశాడు. తాజాగా ప్రత్యర్థి బాక్సర్ షాట్ల నుంచి తనను అలసిపోనీయకుండా తాను పాము రక్తం సేవిస్తున్నానని చెప్పి నాలుగో బౌట్ లో అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో జరిగిన బౌట్ లో కూడా విజేందర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన ఈ బాక్సర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మోదీని కలవడానికి వెళ్తున్నానంటూ తొలుత ట్వీట్ చేసిన విజేందర్, ప్రధానిని కలిసి బాక్సింగ్ గురించి చర్చించినట్లు ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ప్రధానిని కలిసిన తర్వాత చాలా ప్రేరణ పొందినట్లు, ఆయన తనను ఉత్తేజాన్ని కలిగించారని, భారత్ లో ఇక ముందు బాక్సింగ్ ఆట ఎలా ఉండబోతుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విజేందర్ తెలిపాడు. ప్రధానిని కలిసినందకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తదుపరి బౌట్ ఏప్రిల్ 2న ఉండగా, ఆ బౌట్ ను 30వ తేదీకి మార్చుకున్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. లండన్ లోని కాపర్ బాక్స్ ఎరినాలో తన ఐదో బౌట్ జరగుతుందని అక్కడ కూడా మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానని రెండు రోజుల కిందట ట్వీట్ లో వెల్లడించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boxer Vijender  Alexander Horvath  Narendra modi  Twitter  

Other Articles