Rifle shooter turns food stall owner to pursue her dream

National level shooter pushpa gupta sells noodles in vadodara

National Level Shooter Pushpa Gupta Sells Noodles In Vadodara, Pushpa Gupta, shooting, Vadodara, Narendra Modi, Gujarat, National Cadet Corps (NCC), Dinesh Kumar Gupta, rifle shooting

Ever since Modi become the PM, huge stress being put on women empowerment. But, It is just there on the televisions and the newspapers," Dinesh Kumar Gupta, father of Pushpa

నూడుల్స్ అమ్ముతున్న జాతీయస్థాయి రైఫిల్ షూటర్..

Posted: 12/07/2015 04:03 PM IST
National level shooter pushpa gupta sells noodles in vadodara

ప్రతిభ గల క్రీడాకారులకు మన దేశంలో కొదవ లేదు. ఎందరో క్రీడాకారులు క్రీడల్లో దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. తమ ప్రతిభతో క్రీడలకు వన్నెతెచ్చారు. అయితే ప్రతిభ ఉన్న ఎందరో క్రీడాకారులకు సరైన గుర్తింపు లభించక మరుగున పడిపోతున్నారు. అటువంటి వారిలో పుష్పాగుప్తా(21) ఒకరు. షూటింగ్‌లో జాతీయస్థాయి క్రీడాకారిణి అయిన ఆమె ప్రస్తుతం పొట్ట నింపుకునేందుకు రోడ్డు పక్కన నూడుల్స్ అమ్ముకుంటుండడం విషాదం. ప్రోత్సహించేవారు కరువవడం, సాధనకు నిధులు లేకపోవడం వల్ల ఇష్టంగా ఎంచుకున్న క్రీడను వదిలేసి బండిపై నూడుల్స్ విక్రయించుకుంటూ జీవిస్తోంది.
 
‘‘2013లో నేను కాలేజీలో చేరినప్పుడు నాలో షూటింగ్ స్కిల్స్ ఉన్నట్టు గుర్తించాను. దీంతో ఎన్‌సీసీలో చేరాను. దాని ఆర్థిక సహాయంతో సాధన చేశా. జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించా. దీంతో ఆ క్రీడపై నాకు మరింత మక్కువ ఏర్పడింది..’’ అని పుష్ప చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత కోర్సు పూర్తికావడంతో షూటింగ్ సాధనకు నిధులను ఎన్‌సీసీ ఆపేసింది. ఈ క్రీడ చాలా ఖరీదైనది కావడంతో తర్వాత పుష్ప సాధన చేయలేకపోయింది.
 
ఎన్‌సీసీ నుంచి సాయం ఆగిపోవడంతో క్రీడను వదిలేసి కుటుంబ పోషణకు ఏదైనా పని చేసుకోవాలని తండ్రి తనతో చెప్పినట్టు పుష్ప పేర్కొంది. దీంతో దాదాపు ఏడాదిగా రోడ్డు పక్కన నూడుల్స్ అమ్ముతున్నట్టు తెలిపింది. తాను రైఫిల్ పట్టుకుని దాదాపు ఏడాదిన్నర అయిందని పుష్ప ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె గెలుచుకున్న పతకాలను నూడుల్స్ బండికి తగిలించడంతో అవి వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వాటి గురించి ఆసక్తిగా ప్రశ్నించిన వారికి ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణి అని తెలిసి విస్తుబోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
 
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళా సాధికారత గురించి బాగా మాట్లాడతారని, కానీ అది టీవీలు, వార్తా పత్రికలకే పరిమితమైపోతోందని పుష్ప తండ్రి దినేష్ ‌కుమార్ గుప్తా అన్నారు. ప్రభుత్వం నుంచి తాము ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందుకోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు ఓ మహిళా ఎంపీ, మహిళా ముఖ్యమంత్రి ఉన్నారని అయినా ఫలితం శూన్యమని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ తమకు ప్రోత్సాహం అందితే తన కుమార్తె ఇలా వీధుల్లో నూడుల్స్ అమ్ముకోవడం మానేసి తిరిగి రైఫిల్ చేత పడుతుందని దినేష్ గుప్తా అన్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి సాయం అందిస్తే తానేంటో నిరూపించుకునేందుకు పుష్ప సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pushpa gupta  shooting  noodles  Vadodara  

Other Articles