Sepp Blatter and Michel Platini Are Barred From Soccer for 8 Years

Fifa ethics court ban blatter and platini for eight years

Sepp,Blatter, Michel,Platini, ban, football, eight,years, FIFA, Soccer,International Federation of Association Football (FIFA),Blatter Sepp,Platini Michel

Sepp Blatter and Michel Platini, two of the most powerful figures in global soccer, were barred for eight years on after being found guilty of ethics violations.

బ్లాటర్, ప్లాటినిలపై 8 ఏళ్ల సస్పెన్షన్ వేటు

Posted: 12/21/2015 05:37 PM IST
Fifa ethics court ban blatter and platini for eight years

పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించిన ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ పై వేటు పడింది. ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన్ను ఫుట్ బాల్ తో సంబంధమున్న అన్ని కార్యకలాపాల నుంచి బహిష్కరిస్తున్నట్టు ఫిపా విచారణ కమిటీ వెల్లడించింది. ఆయనతో పాటు యుఫా చీఫ్ మైఖేల్ ప్లాటినిని కూడా సస్పెండ్ చేసింది. ఈ ఏడాది మే నెలలో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్ పై అవినీతి ఆరోపణలు మరింత తీవ్రతరం కావడంతో విచారణ చేపట్టిన కమిటీ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో అమెరికా, ఇంగ్లండ్‌లతో పాటు యూరోపియన్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) లు బ్లాటర్ ను బయటకు పంపాలని చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించినట్లయ్యింది.

దాదాపు రెండు మిలియన్ డాలర్లకు పైగా అవినీతి సొమ్ము  వారి ఖాతాల్లోకి వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఫిఫా చర్యలు చేపట్టింది. కొన్ని నెలలుగా దర్యాప్తు జరిగిన పిదప ఈ ఘటన ఓ కొలిక్కి వచ్చింది. వీరిద్దరు తమ అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టు తాజాగా పేర్కొంది. బ్లాటర్ కు యాభైవేల డాలర్లు, ప్లాటినికి ఎనభై వేల డాలర్లు జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వారిపై ఆరోపణలు రుజువవడంతో సస్పెండ్ చేస్తున్నట్టు విచారణ కమిటీ పేర్కొంది. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sepp  Blatter  Michel  Platini  ban  football  eight  years  FIFA  

Other Articles