Haryana boy Shubham Jaglan wins Junior World Golf title

10 year old shubham jaglan wins world junior golf championship

haryana, golf, delhi, Shubham Jaglan, Junior World Golf Championships, Newdelhi, World Junior Golf Championship, San Diego, California, Australia’s Jeffrey Yu Guan, prestigious tournaments in junior golf, coach Nonita Lall Qureshi, golf

Shubham Jaglan beat Australia’s Jeffrey Yu Guan by one stroke to win the World Junior Golf Championship in San Diego, California. He carded a final round of 60 to edge 114 other young golfers competing in the tournament.

ప్రపంచ గోల్ఫ్ చాంపియన్ గా బాల భారతీయుడు

Posted: 07/19/2015 02:41 PM IST
10 year old shubham jaglan wins world junior golf championship

ప్రపంచ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్‌గా భారత్‌కు చెందిన పదేళ్ల బాలుడు శుభమ్ జగ్లన్ నిలిచాడు. భారతదేశంలో అంతగా గుర్తింపు లేని ఈ ఆటపై మక్కువతో చిన్నారి చేసిని కఠోర శిక్షణ అతనిని ప్రపంచ ఛాంపియన్ గా నిలిపింది. పానిపట్ కు చెందిన చిన్నోడు పదేళ్ల ప్రాయంలోనే ఆటలో బాగా రాణించి ప్రపంచ జూనియర్ ఛాంపియన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. కాలిఫోర్నియాలో ఐఎంజీ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో వివిధ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు.

పైనల్స్ లో శుభమ్ జగ్లన్.. అస్ట్రేలియాకు చెందిన జెఫ్రీ యుగువాన్ క్రీడాకారుడిపై గెలిచారు. గత ఏడాది ఫైనల్ వరకు చేరుకుని రన్నర్ అప్ గా నిలిచిన శుబమ్ జగ్లన్ మరింత శిక్షణ తీసుకుని ఈ ఏడాది జరిగిన పోటీలలో జూనియర్ టైటిల్ ను ధక్కించుకున్నాడు. హర్యానాలోని పానిఫట్ ప్రాంతంలోని ిస్నానా గ్రామానికి గోల్ప్ లో శిక్షణ తీసుకోవడం కోసంఢిల్లీలో స్థిరపడింది. భారత్ వంటి దేశాల్లో దీనిని సంపన్నుల ఆటగా పరిగణిస్తూ.. చిన్నారులు గోల్ప్ ఆట కు దూరంగా వుంటూ ఇతర క్రీడలలో రాణిస్తున్న తరుణంలో అతని తల్లిదండ్రులు అతడికి కోసం దేశరాజధానికి వలస వెళ్లడం గర్వకారణం. కాగా తాను ఈ టైటిల్ సాధించినందుకు జగ్లన్ తన తల్లిదండ్రలకు, ఆ తరువాత తన కోచ్ నోనిటా లాల్ ఖరేషీకి జగ్లన్ కృతజ్ఞతలు తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shubham Jaglan  Junior World Golf Championships  Newdelhi  golf  

Other Articles