Marussia F1 driver Jules Bianchi dies nine months after Japanese Grand Prix crash

Formula one driver jules bianchi died

formula one driver jules bianchi died, Formula One driver Jules Bianchi lost his fight for life, Jules, Bianchi, rightend ,racing, world, tribute, French, F1, driver, loses, fight, life, F1 driver Jules Bianchi dies after 9 months in coma, motorsport, world mourns, Jules Bianchi, Marussia F1 driver, Japanese Grand Prix crash

Jules Bianchi died at the age of 25 as a result of head injuries sustained at last October's Japanese Grand Prix.

జ్యుల్స్ బియాంచి జీవన పోరాటం ముగిసింది

Posted: 07/18/2015 08:17 PM IST
Formula one driver jules bianchi died

తొమ్మిది మాసాల క్రితం జరిగిన ప్రమాదంలో కోమాలోకి జారుకుని అప్పటి నుంచి జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూ.. బ్రతుకు మీద ఆశతో.. లక్ష్యం మీద గురితో ఆయన చేసిన పోరాటం ముగిసింది. వేగంగా వాహనచోదకంలో ప్రావిణ్యం సంపాదించిన క్రీడాకారుడికి పాతికేళ్ల వయస్సులోనే నిండు నూరేళ్లు నిండుకున్నాయి. ప్రాన్స్ కు చెందని ఫార్మలావన్ డ్రైవర్ జ్యుల్స్ బియాంచి ఇవాళ ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.

గత ఏడాది అక్టోబర్ మాసంలో సుజుకాలో జరిగిన జపానిత్ గ్రాండ్ ప్రిక్స్ లో పాల్గోన్న బియాంచి ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై కోమాలోకి జారుకున్నాడు. అప్పటి నుండి ఫ్రాన్సులోని తన ఇంటికి దగ్గర్లో వున్న అస్పత్రిలో చికిత్స పోందుతున్న బియాంచి ఇవాళ ఉదయం కన్నుమూశారు. చివరి క్షణం వరకు బియాంచి పోరాడేవాడని, అతని పోరాటం నేటితో ముగిసిందని బియాంచి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా బియాంచి మృతితో రేసింగ్ ప్రపంచం మొత్తం శోకసంధ్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల పలువరు రేసింగ్ దిగ్గజాలు కూడ ప్రగాఢ సంతాపం తెలిపారు.

పలువురు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా బియాంచి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. 1994 లో అయిర్టాన్ మరణం తరువాత ఓ గ్రాండ్ ప్రిక్స్ లో రేస్ డ్రైవర్ చనిపోవడం ఇదే తొలిసారి. బియాంచి బతికే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయిని గత నెలలో అతని తండ్రి పిలిప్ స్థానిక మీడియాకు తెలపడంతో ఆయన స్నేహితులు, అభిమానులు అప్పుటి నుంచి దు:ఖసాగరంలో మునిగారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jules Bianchi  Marussia F1 driver  Japanese Grand Prix crash  

Other Articles