No bias against doubles players, time to put all this to rest

Jwala gutta ashwini ponnappa getting all the support says pullela gopichand

No bias against doubles players, time to put all this to rest, Ashwini Ponappa, Badminton, Badminton Authority of India, Doubles badminton, Gopichand, Jwala Gutta, Pullela Gopichand, Rio Olympics, Sports Authority of India, Sports Ministry, TOP scheme

Gopichand said: "It is too often that they have been talking about this. I think they need to be specific about what their issues and problems are. Blaming and pointing fingers without any basis and credit is just not done."

ఇకనైనా మాటలు మానండి.. ఆటలు ఆడండీ..!

Posted: 07/09/2015 07:00 PM IST
Jwala gutta ashwini ponnappa getting all the support says pullela gopichand

భారత బ్యాడ్మింటన్ మహిళా డబుల్స్ జోడీ, క్రీడాకారిణులు గుత్తా జ్వాలా, అశ్వని పోన్నప్ప తనపై ఎందుకు కక్ష కట్టారో.. తనకు తెలియదని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. జ్వాలా గుత్తా తనపై చేసిన.విమర్శలపై ఆయన వివరణ ఇచ్చారు. జ్వాల ఎందుకు తనను లక్ష్యం చేసుకుందో తెలియడంలేదన్నారు. అయినదానికీ కానిదానికీ నిందించడం సరికాదన్నారు. తనపని ఏదో తాను చేసుకుపోతానని, అది అందరికీ తెలుసని, వివాదాలు తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. ఆమె విమర్శించింది కదా అని విమర్శలు చేయలేనని గోపీచంద్ చెప్పుకొచ్చారు.
 
అదే సమయంలో టాప్ ప్రోగ్రామ్‌లో జ్వాల, అశ్విని పేర్లు చేర్పించేందుకు ఎంతో కృషి చేశానని అన్నారు. ఇందుకోసం స్పోర్ట్స్ అధారిటీ డీజీతో మాట్లాడానని గోపీచంద్ తెలిపారు. జ్వాల వ్యాఖ్యలు సాయ్, బాయ్, టాప్ ఖండించడం ద్వారా తన నిజాయతీని గుర్తించినట్లు తాను భావిస్తున్నానని గోపీచంద్ వ్యాఖ్యానించారు. జ్వాల తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, జ్వాల, అశ్వినికి పూర్తి సౌకర్యాలు అందజేశామని, అందువల్లే వారు ఇప్పుడున్న స్థానానికి చేరుకున్నారని గోపీచంద్ స్పష్టం చేశారు. వారు కోరిన మేరకు వారికి డబుల్స్ లో నిష్ణాతులైన కోచ్ లతో శిక్షణను కూడా ఇప్పిస్తున్నామని చెప్పారు.

భారత ప్రభుత్వంతో పాటు బ్యాట్మింటన్ సంఘం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల నుంచి కూడా గుత్తా జ్వాల, అశ్వినీలకు తగిన సహకారం అందుతుందని అన్నారు. ఇప్పటికైనా వివాదాలు మాని అటపై దృష్టి పెడితే మంచిదని గోపిచంద్ అభిప్రాయపడ్డారు. ఇకనైనా విమర్శలు కట్టిపెట్టాలని ఆయన సూచించారు. ఇక ఇలాంటి వారటికి ముగింపు పలికి మన శ్రమను ఆటలో ఎదిగేందుకు వాడాల్సిన అవసరం వుందని గోపిచంద్ వ్యాఖ్యానిచారు. జ్వాల, అశ్విన అడే అన్ని టోర్నీలకు సాయ్, భాయ్ లు అండగా నిలిచాయని గోపిచంద్ చెప్పుకోచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala gutta  ashwini ponnappa  pullela gopichand  badminton  

Other Articles